ఆనందంగా ఉంది | - | Sakshi
Sakshi News home page

ఆనందంగా ఉంది

May 6 2026 8:55 AM | Updated on May 6 2026 8:55 AM

పాలిసెట్‌లో 120కి 120 రావడం సంతోషంగా ఉంది. రాష్ట్ర స్థాయిలో పదో ర్యాంక్‌, జిల్లా, ఎస్వీయూ రీజియన్‌ స్థాయిలో ఫస్ట్‌ ర్యాంక్‌ రావడం ఆనందంగా ఉంది. నా తదుపరి లక్ష్యం ఐఐటీలో సీటు సాధించడమే. తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే. వారి ప్రోత్సాహంతో పాటు విశ్వం విద్యా సంస్థల డైరెక్టర్‌, టీచర్ల సహకారంతో నేను ఈ ర్యాంకు సాధించా. – వెల్దుర్తి మోక్షిత్‌,

స్టేట్‌ 10వ ర్యాంకర్‌, తిరుపతి

సంతోషానిచ్చింది

పాలిసెట్‌లో జిల్లా స్థాయిలో రెండో ర్యాంక్‌ రావడం ఆనందంగా ఉంది. 120 మార్కులకు గాను 119 స్కోర్‌ చేయడం సంతృప్తి నిచ్చింది. జిల్లా స్థాయిలో రెండో ర్యాంక్‌, రాష్ట్ర స్థాయిలో 35 వ ర్యాంక్‌ రావడం సంతోషానిచ్చింది. శశి విద్యా సంస్థలకు ధన్యవాదాలు. ఇంటర్‌ పూర్తి చేసి జేఈఈలో రాణించి ఐఐటీలో చదవాలన్నది నాకోరిక. ఆ దిశ ప్రయత్నం చేస్తున్నాను.

– ఎన్‌ గిరీష్‌, జిల్లాస్థాయి 3 ర్యాంకు, తిరుపతి

ఇదే స్ఫూర్తితో ముందుకెళతా!

పాలిసెట్‌లో 120కి 119 మార్కులు వచ్చాయి. జిల్లా స్థాయిలో 3వ ర్యాంక్‌, రాష్ట్ర స్థాయిలో 59వ ర్యాంక్‌ రావడం గర్వంగా ఉంది. నా లక్ష్యం ఐఐటీలో సీటు సాధించడమే. ఓపెన్‌ కేటగిరీలో జాతీయ స్థాయిలో మంచి ర్యాంకు సాధించాలన్నదే లక్ష్యం. శశి విద్యాసంస్థల ఉపాధ్యాయుల సహకారం మరులేనిది. ఇదే స్ఫూర్తితో ముందుకెళతా. – శ్యామ్‌నాథ్‌ శ్రీహర్ష,

జిల్లాస్థాయి 3 ర్యాంకర్‌, తిరుపతి

Advertisement
 
Advertisement
Advertisement