కాలం దొర్లిపోతోంది.. ప్రభుత్వాలు..పాలకులు మారుతున్నా..
ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కాని సరిహద్దుల వివాదం
తరచూ సరిహద్దు వివాదాలు..
సరస్సులో నీళ్లు తగ్గినప్పుడల్లా సరిహద్దు వివాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. 1983 నుంచి సరిహద్దు వివాదాలు చోటు చే సుకుంటున్నాయి. రాయదొరువు ముఖద్వా రం పూడి పోవడంతో ఉత్తరం వైపు సరస్సు పూర్తిగా ఎడారిలా మారిపోయింది. పల్‌వేరికాడ్ ముఖద్వారంతో దక్షిణం వైపు సరస్సులో నీళ్లు పుష్కలంగా ఉండడంతో ఏపీ జాలర్లు దక్షిణం వైపు సరస్సులో ఆంధ్రా పరిధిలోని కురివితెట్టు, తెత్తుపేట లాంటి ఏరియాలో చేపల వేటకు వెళుతున్నారు. ఈ ప్రాంతం తమిళనాడు పరిధిలోనికి వస్తుందని చిన్నమాంగోడు కుప్పం, పెద్ద మాంగోడు కుప్పం, కీరపాకపుదుకుప్పాలకు చెందిన జాలర్లు మీరు ఇక్కడికి వేటకు రాకూడదని ఆంక్షలు విధిస్తున్నారు.
వేట లేక భీములవారిపాళెం రేవులో ఆపి ఉంచిన పడవలు
సూళ్లూరుపేట: ఆంధ్రా–తమిళనాడు రాష్ట్రాల పరిధిలో విస్తరించిన పులికాట్ సరస్సు తీరంలో ఉన్న జాలర్లు నిత్యం జీవన పోరాటం చేస్తున్నారు. ఈ సరస్సుపై 17 గ్రామాలకు చెందిన 20 వేల మందికి పైగా మత్స్యకారులు చేపల వేట ప్రధానవృత్తి గా జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కాలంలో మ త్స్యసంపద కూడా బాగా తగ్గిపోయింది. అంతకు ముందు సంవత్సరానికి సుమారు 3 వేల నుంచి 5 వేల టన్నులు చేపలు, రొయ్యలు, పీతలు పట్టేవా రు. ప్రస్తుతం రెండు వేల టన్నులు చేపలు మాత్ర మే దొరుకుతున్నట్టు జాలర్లు లెక్కలు చెబుతున్నా యి. అంటే ఈ సరస్సు జీవవైవిధ్యాన్ని కోల్పోయి కాలుష్య కోరల్లో చిక్కుకుని సహజత్వాన్ని కోల్పోతుండడంతో మత్స్యసంపద నానాటికి తగ్గిపోతుంది. వర్షాలు బాగా కురిసినపుడు నదులు, కాలువల నుంచి వచ్చే మంచినీళ్లు, సముద్ర ముఖద్వారాల నుంచి వచ్చే ఉప్పునీరు కలవడంతో మత్స్యసంపద అభివృద్ధి చెందుతుంది. ఆ సమయంలో పులికాట్ సరస్సులో 45 శాతం సైలెనిటి (ఉప్పుశాతం) ఉండడంతో మత్స్యసంపద పెరగడానికి దోహదపడుతుంది. ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన ఈ సర స్సు ఒకనాడు అందాల తీరంగా పడవ ప్రయాణాలతో అలరారింది. మానవ వనరులు పెరిగిన తరువాత కాలుష్యం కోరల్లో చిక్కుకుని ప్రస్తుతం విలవిలలాడుతోంది. తమిళనాడు పరిధిలో ఎళ్లావూరు, గుమ్మిడిపూండి, తడ మండలంలో పారిశ్రామిక వాడలు పెరిగి ఎన్నో కంపెనీలు వెలిశాయి. ఈ కంపెనీల నుంచి వ్యర్థాల జలాలు, కాలుష్యం సరస్సుకు వదిలేయడంతో సహజత్వాన్ని కోల్పోతోంది. ఈ ప్రాంతంలో రైతులు పండించే పంటల్లో కూడా రసాయనిక ఎరువులు వాడకం విపరీతంగా పెరగడం, మడ అడవులు అంతరించి పోవడంతో సరస్సులో మత్స్యసంపద తగ్గిపోయిందని జాలర్లు చెబుతున్నారు. సముద్ర ముఖద్వారాలు పూడిపోవడంతో వేసవి కాలం రాకముందే ఉత్తరం వైపు భాగమంతా ఎడారిని తలపించేలా ఎండిపోతోంది. దక్షిణం వైపు సరస్సు మాత్రం నీళ్లు తగ్గినా ఇప్పటికీ నిండుగా కనిపిస్తుంది. వేసవి కాలంలో ఇరకదీవి వైపు చేపలవేటకు వెళితే ఈ ప్రాంతం మీది కాదు.. మాది అని తమిళనాడు జాలర్లు వలలు పెరికేయడం, పడవలను తోసేయడం వంటి వివాదాలతో వేట చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.
తరచూ సరిహద్దు వివాదాలకు కేంద్రంగా ఉన్న కురివితెట్టు ప్రాంతం
ఏ రాష్ట్రంలో ఎంత భాగం ఉందనేది తేల్చండి
ఆంధ్రా–తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించిన పులికాట్ సరస్సు ఏ రాష్ట్రంలో ఎన్ని విస్తరించి వుంది అనే విషయాన్ని అధికారులు ఇప్పటికీ తెలియజేయకపో వడంతో వీరి మధ్య వివాదాలకు ఆజ్యం పోస్తోంది. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏ రాష్ట్రంలో ఎంత ఉంది! ఎక్కడ వరకు ఉందనే విషయాన్ని తేల్చి చెప్పేస్తే తెలిసినట్టుగా ఉంటుందని జాలర్లు అభిప్రాయ పడుతున్నారు. పర్యావరణ శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రా ల్లోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా, తిరువళ్లూరు జిల్లాల పరిధిలో పులికాట్ సరస్సు సుమారు 600 చదరపు కిలోమీటర్లు పరిధిలో విస్తరించి వుంది. ఇందులో 460 చదరపు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ పరిధిలోని నెల్లూరుజిల్లా తడ, సూళ్లూరుపేట, దొరవారిసత్రం, వాకాడు, చిట్టమూరు మండలాల్లో విస్తరించి వుంది. మిగిలిన 140 చదరపు కిలో మీటర్లు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి, పొన్నేరి తాలుకా పరిధిలో విస్తరించి ఉంది. పులికాట్ సరస్సులో 16 దీవి గ్రామాలు, 30 తీర ప్రాంత గ్రామాలున్నాయి. ఇందులో ఆంధ్రా పరిధిలో 17 జాలర్ల కు ప్పాలకు చెందిన వారు 20 వేల మందికి పైగా చేపల వేటే ప్రధానవృత్తిగా జీవనం సాగిస్తున్నారు. పరోక్షంగా మరో పది వేల మంది గిరిజనులు చేపల వేట ఆధారంగా బతుకు బండి లాగుతున్నారు. తమి ళనాడు వైపు మరో ఐదారు కుప్పాల్లో సుమారు 10 వేల మంది దాకా చేపల వేట చేసుకుని జీవిస్తున్నారు. 1983 నుంచి ఏటా వేసవికాలంలో సరిహద్దు వివా దం తలెత్తుతూనే వుంది. 1992లో సరస్సు పరిధి ఏ రాష్ట్రంలో ఎంత ఉంది. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉందనే విషయంపై రెండు రాష్ట్రాల అధికారులు స ర్వే చేయించాలని ఇక్కడి జాలర్లు ప్రభుత్వానికి నివేది క ఇచ్చారు. దీనికి సంబంధించి కొంతమేర నగదు కూడా ప్రభుత్వానికి చెల్లించారు. 1994లో సర్వే చేసేందుకు మన రాష్ట్ర అధికారులు సిద్ధం కాగా తమిళనాడు అధికారులు సహకరించకపోవడంతో సర్వే ఆగిపోయింది. దీంతో ఈ వివాదం కొనసాగుతూనే ఉన్నప్పటికీ 2007లో రాష్ట్ర మత్స్యశాఖామంత్రి మండలి బుద్ధప్రసాద్, తమిళనాడు మత్య్సశాఖ మంత్రి కేపీపీ స్వామితో రెండు రాష్ట్రాల మత్స్యశాఖాధికారులతో హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అప్పుడు కూడా తమిళనాడు అధికారులు స హకరించలేదు. దీంతో ఈ సమస్య ఏటా ఉత్పన్నమవుతూనే ఉంది. ఏపీ పరిధిలో శ్రీహరికోట దీవిలోని తెత్తుపేట వద్ద ఒక కొత్త ముఖద్వారాన్ని తెరిస్తే సమ స్య సమసిపోతుందని ప్రభుత్వానికి విన్నవించారు. అయితే షార్ భద్రతను దృష్ట్యా ముఖద్వారం ఏర్పా టుకు అవకాశం లేకుండా పోయింది. ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని జాలర్లు సోమ వారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సంఘీభావం తెలియజేసి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఢిల్లీస్థాయిలో అధికారులు దృష్టికి కూడా తీసుకెళతానని చెప్పారు.
కాలం దొర్లిపోతోంది.. ప్రభుత్వాలు..పాలకులు మారుతున్నా..
కాలం దొర్లిపోతోంది.. ప్రభుత్వాలు..పాలకులు మారుతున్నా..


