ప్రొద్దుటూరు వెటర్నరీ కళాశాల అసోసియేటెడ్ డీన్‌గా ప్రొఫ
చంద్రగిరి: తిరుపతి ఎస్వీ వెటర్నరీ కళాశాల అనిమల్ హస్బెండరీ ఎక్స్టెన్షన్ విభాగాధిపతిగా విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జీఆర్‌కే శర్మ ప్రొద్దుటూరు వెటర్నరీ కళాశాల అసోసియేటెడ్ డీన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఎస్వీ వెటర్నరీ వర్సిటీ రిజిస్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఈ పదవిలో రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొద్దుటూరు వెటర్నరీ కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు వర్సిటీ అధికారులు, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.


