వర్గపోరుతో పీఎంఏజీవై నిధులకు గ్రహణం | - | Sakshi
Sakshi News home page

వర్గపోరుతో పీఎంఏజీవై నిధులకు గ్రహణం

Jan 23 2026 6:28 AM | Updated on Jan 23 2026 6:29 AM

న్యూస్‌రీల్‌

పనులు చేయకుండానే మేసేసిన టీడీపీ నేతలు చేసిన పనులూ నాసిరకమే రూ.వందల కోట్ల స్వాహా కమీషన్లకు అధికారుల కక్కుర్తి నిద్రమత్తులో క్వాలిటీ విభాగం అధికారులు

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇదీ దుస్థితి

రథసప్తమికి సర్వం సిద్ధం
తిరుమలలో రథసప్తమికి సర్వం సిద్ధం చేశామని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు పేర్కొన్నారు.

శుక్రవారం శ్రీ 23 శ్రీ జనవరి శ్రీ 2026

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ గ్రామాల సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పీఎంఏజీవై (ప్రధానమంత్రి ఆదర్శ్‌ గ్రామ యోజన) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి రూ.కోట్ల బడ్జెట్‌ విడుదల చేస్తోంది. ఈ పథకాన్ని పక్కాగా అమలు చేయాల్సిన అధికారులు టీడీపీ నేతలతో కుమ్మక్కవుతున్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి పనుల నాణ్యతను గాలికొదిలేస్తున్నారు. ఇదే అదునుగా అధికార పార్టీ నేతలు తూతూమంత్రంగా పనులు చేసి జేబులు నింపుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించాల్సిన ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫలితంగా సమస్యల పరిష్కారం కోసం ఆయా గ్రామాల ప్రజలు నిత్యం చిత్తూరు, తిరుపతి కలెక్టర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పీఎంఏజీవై నిధుల దుర్వినియోగంపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్టు.

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 17 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 74,056 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 27,517 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.98 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామివారిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది.

యూనివర్సిటీలో

జాబ్‌ మేళా రేపు

తిరుపతి అర్బన్‌: ఎస్వీ యూనివర్సిటీలోని ఎంప్లాయీమెంట్‌ ఆఫీస్‌ వద్ద శనివారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి జాబ్‌ మేళా ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ఈఎంసీ క్లస్టర్‌ శ్రీసిటీ, చైన్నెలోని పలు కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నాయని వెల్లడించారు. పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, పీజీ చదువుకున్న వారు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ముందుగా శుక్రవారం రిజి స్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించారు. అదనపు సమాచారం కోసం 81435 76866, 99888 53335 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

టీటీడీకి రూ.10 లక్షల విరాళం

తిరుమల: చిత్తూరుకు చెందిన చింతల దివ్యాంత్‌ రెడ్డి అనే భక్తుడు గురువారం టీటీడీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.10 లక్షలు విరాళం అందజేశారు. దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈఓ క్యాంపు కార్యాలయంలో అదనపు ఈఓ సి.హెచ్‌.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

నేడు శ్రీవారి ఆలయంలో వార్షిక విశేష పూజ

తిరుమల: వసంత పంచమి పర్వదినం సందర్భంగా శుక్రవారం శ్రీవారి ఆలయంలో వా ర్షిక విశేష పూజ నిర్వహించనున్నారు. గతంలో శ్రీవారి ఆలయంలో ప్రతి సోమవారం వారపు సేవగా విశేష పూజ చేసేవారు. ఇందులో భాగంగా శ్రీవారి ఉత్సవమూర్తుల అరుగుదలను అరికట్టి భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఏడాదికోసారి మాత్రమే అభిషేకం నిర్వహించాలని జీయంగార్లు, అర్చకులు, ఆగమ పండితులు సూచించారు. ఈ క్రమంలో వసంతోత్సవం, సహస్ర కలశాభిశేకం, విశేష పూజలను ఏడాదికోసారి నిర్వహించాలని టీటీడీ గతంలో నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ప్రతి ఏటా వసంత పంచమి పర్వదినాన వార్షిక విశేష పూజను ఏకాంతంగా నిర్వహిస్తోంది.

నిధుల మేత..

చిత్తూరు కార్పొరేషన్‌: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పీఎంఏజీవై పథకం నీరుగారుతోంది. ఈ పథకం నిధుల దుర్వినియోగం పై పలు గ్రామాల ఎస్సీ, ఎస్టీ ప్రజలు నేరుగా పంచాయతీరాజ్‌శాఖ మంత్రికి ఫిర్యాదులు చేస్తున్నారు. చేపడుతున్న పనుల్లో నాణ్యతా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. టీడీపీ నేతలు పనులను నాసిరకంగా చేసి చేతులు దులుపుకుంటున్నారు. మురుగు కాలువల నిర్మాణం, చెత్త బండ్ల కొనుగోలు, రోడ్లు, వీధి లైట్లు పనులు చేయకుండానే చేసినట్టు బిల్లులు సృష్టిస్తున్నారు. రోడ్ల పనుల్లో నాసిరకం సిమెంట్‌ వాడకం, నిష్పత్తి ప్రకా రం ఇసుక, కంకర వాడకుండా మోసం చేస్తున్నారు. తాగునీటికి ఏర్పాటు చేసిన పైపుల్లో నాణ్యత లేని వాటిని వినియోగిస్తున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన సంబంధిత శాఖల అధికారులు లంచాలకు అలవాటుపడి బిల్లులను ఆమోదిస్తున్నారు.

నీకింత..నాకింత!

రెండు జిల్లాల్లో పీఎంఏజీవై పథకం నిధులను కాజేసేందుకు సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పచ్చనేతతో కుమ్మక్కయ్యారు. అధికారులు15 నుంచి 20 శాతం వరకు.. ప్రజాప్రతినిధులు 20 శాతం వరకు కమీషన్లు దిగమింగుతున్నా రు. దీంతో ప్రజల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా అటు అధికారులు, ప్రజాప్రతినిధులు తమకేమీ సంబంధం లేదనే ధోరణిలో మిన్నకుండిపోతున్నారు.

మీదే రాజ్యం..మేం కన్నెత్తి చూడం!

పీఎంఏజీవై పథకాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి, సమీక్షలు నిర్వహించాల్సిన చిత్తూరు, తిరుపతి కలెక్టర్లు పట్టించుకోవడం లేదు. దీంతో క్షేత్ర స్థాయిలో అధికారులు.. పచ్చ నేతలు ఆడిందే ఆటగా నిధుల ను దుర్వినియోగం చేస్తున్నారు. నాసిరకంగా పనులను చేసి ఎస్సీ,ఎస్టీ గ్రామాల ప్రజలను మోసగిస్తున్నారు.

రూ.23.19 కోట్లతో పనులు

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని మొత్తం 65 మండలాల్లో మూడు విడతల్లో 118 గ్రామాల్లో రూ.23.19 కోట్ల అంచనా వ్యయంతో 720 పనులు చేపట్టారు. ఎంపిక చేసిన ఒక్కో గ్రామానికి రూ.20 లక్షల చొప్పున నిధులను మంజూరు చేశారు. మొత్తం మూడు విడతల్లో చిత్తూరు జిల్లాలోని 437 పనులకు గాను రూ.13.53 కోట్లు, తిరుపతి జిల్లాలో 283 పనులకు రూ.10.42 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులతో ఎంపిక చేసిన ఎస్సీ, ఎస్టీ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాల్సి ఉంది. విద్య, వై ద్యం, మౌలిక వసతులతో పాటు ఆయా గ్రామా ల్లో ని యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చి ఆర్థిక స్వావలంబనకు చర్యలు చేపట్టాలి. అయితే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈ పథకం ఆశయం నిర్వీర్యమవుతోంది.

దళిత గ్రామాల అభివృద్ధికి పీఎంఏజీవై నిధులు

వరదయ్యపాళెం: సత్యవేడు నియోజకవర్గంలో అటు ఎమ్మెల్యే, ఇటు నియోజకవర్గ ప్రోగ్రామ్‌ కో–ఆర్డినేటర్‌ మధ్య వర్గ విబేధాలతో అభివృద్ధి పనులను ముందుకు సాగనివ్వడం లేదు. ఆ మేరకు ఇటీవల మొదటి, రెండో విడతలో నియోజకవర్గంలో 15 గ్రామాల వరకు పీఎంఏజీవై పథకం కింద ఎంపిక అయ్యాయి. ఆ దిశగా వరదయ్యపాళెం మండలం బత్తలవల్లం పంచాయతీ చెదులుపాకంలో శ్మశానవాటికకు ప్రహరీ గోడ, షెడ్డు, అంగన్‌వాడీ భవన నిర్మాణానికి పీఎంఏజీవై పథకం కింద రూ. 20 లక్షలు మంజూరు చేసింది. అయితే 3 నెలలుగా స్థానికంగా రెండు వర్గాల మధ్య వర్గపోరుతో పనులు ఆగిపోయాయి. ఈ విషయంలో ఎంపీడీఓ ఏకపక్షంగా ఒక వర్గానికి వత్తాసు పలకడంతో మరో వర్గం తమకు పనులు కేటాయించాలని అడ్డుకున్నారు. దీంతో సర్దుబాటు చేయలేని అధికారులు పనులను అలాగే వదిలేశారు. నాగలాపురం, సత్యవేడు, నారాయణవనం, బీఎన్‌కండ్రిగ, కేవీబీపురం మండలాల్లో ఇప్పుడిప్పుడే కొన్ని పనులు ప్రారంభ దశలో ఉన్నాయి.

చేయాల్సిన పనులు

ఎంపికైన గ్రామాల్లో శుద్ధ నీరు, పారిశుద్ధ్యం, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం, రహదారి పనులు, కాలువలు, సోలార్‌ లైట్స్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది.

వర్గపోరుతో పీఎంఏజీవై నిధులకు గ్రహణం1
1/6

వర్గపోరుతో పీఎంఏజీవై నిధులకు గ్రహణం

వర్గపోరుతో పీఎంఏజీవై నిధులకు గ్రహణం2
2/6

వర్గపోరుతో పీఎంఏజీవై నిధులకు గ్రహణం

వర్గపోరుతో పీఎంఏజీవై నిధులకు గ్రహణం3
3/6

వర్గపోరుతో పీఎంఏజీవై నిధులకు గ్రహణం

వర్గపోరుతో పీఎంఏజీవై నిధులకు గ్రహణం4
4/6

వర్గపోరుతో పీఎంఏజీవై నిధులకు గ్రహణం

వర్గపోరుతో పీఎంఏజీవై నిధులకు గ్రహణం5
5/6

వర్గపోరుతో పీఎంఏజీవై నిధులకు గ్రహణం

వర్గపోరుతో పీఎంఏజీవై నిధులకు గ్రహణం6
6/6

వర్గపోరుతో పీఎంఏజీవై నిధులకు గ్రహణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement