గంజాయి మాఫియాపై ఉక్కుపాదం
– 8లో
– 8లో
చంద్రగిరి మండలంలో గంజాయి మాఫియా పై ఉక్కుపాదం మోపుతామని సీఐ సురేష్ కుమార్ చెప్పారు.
వెంకటగిరి మండలం లాలా పేటలో జరుగుతున్న డ్రైన్‌ల నిర్మాణం
పర్యవేక్షణ లోపం
డ్రైనేజీలకు శాపం
వెంకటగిరి(సైదాపురం): అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని చందంగా మారింది. పీఎంఏజీవై నిధులను ప్రభుత్వం మంజూరు చేసినా వాటిని సద్వినియోగం చేసుకునే పాపాన పోలేదనే విమర్శలు గుప్పుమంటున్నారు. ప్రారంభమైన మురుగు నీటి కాలువల నిర్మాణ పనులు కూడా నాణ్యత లోపించడంతో ఇష్టానుసారంగానే డ్రైనేజీ పనులను కొనసాగించడంపై నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదికాలాలపాటు ఉండాల్సిన పనులు నాణ్యత లోపిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వెంకటగిరి నియోజకవర్గంలోని పీఎంఏజీవై పథకం పనుల తీరుతెన్నులు ఇలా ఉన్నాయి. నియోజకవర్గ కేంద్రమైన వెంకటగిరి కి పీఎంఏజీవై నిధులు మంజూరు కాగా వాటిలో రూ.20 లక్షల వ్యయంతో రూరల్ మండలంలోని లాలాపేటలో డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టారు. సుమారు 615 మీటర్లతో పనులను ప్రారంభించి, పనులు కూడా ముగించేశారు. ఆ సమయంలో ఇష్టానుసారంగా పనులను జరగడంతో నాణ్యత లోపించిదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అలాగే సైదాపురం మండలంలోని రామసాగరం, కొమ్మిపాడు, కృష్ణారెడ్డిపల్లి గ్రామాలను ఎంపిక చేసినా కూడా కేవలం కృష్ణారెడ్డిపల్లి పంచాయతీకి రెండు డ్రైన్లు, ఒక బోర్, ఒక ఆర్వో ప్లాంట్‌కు రూ.20 లక్షలు నిధులను మంజూరు చేశారు. కానీ ఆ పనులు నేటికీ ప్రారంభించలేదు. రాపూరు మండలంలోని కంబాలపల్లి, గరిమెనపెంట, ఏపూరుకు రూ.20లక్షల చొప్పున మొత్తంగా రూ.60 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ పనులు కూడా ఇంకా ప్రారంభించలేదు.
తిరుపతి జిల్లా సమాచారం
ఎంపికై న గ్రామాలు 52
పనుల సంఖ్య 283
వాటి విలువ రూ.10.33 కోట్లు
ఖర్చు రూ.4.12 కోట్లు


