ఉపాధ్యాయులపై పాలకులకు నిర్లక్ష్యం తగదు | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులపై పాలకులకు నిర్లక్ష్యం తగదు

Aug 3 2025 8:38 AM | Updated on Aug 3 2025 8:38 AM

ఉపాధ్

ఉపాధ్యాయులపై పాలకులకు నిర్లక్ష్యం తగదు

● గురువులను విద్యాబోధనకు పరిమితం చేయండి ● అనవసరమైన యాప్‌ల నుంచి విముక్తి కల్పించండి ● డిమాండ్లు పరిష్కరించకుంటే మరింతగా ఉద్యమిస్తాం ● తిరుపతి వేదికగా ఉపాధ్యాయ సంఘాల హెచ్చరిక

మా పోరాటం ఆగదు

సమస్యలను పరిష్కరించేంత వరకు మా పోరాటం ఆగదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఏడాది గడిచినా మా సమస్యలు గుర్తు రావడం లేదు. ఎన్నికలకు ముందు అన్నీ చేస్తామని చెప్పి, ఇప్పుడు కాలయాపన చేస్తున్నారు. గురువులను బాధ పెట్టడం ఎవరికీ మంచిది కాదు.

–రమణారెడ్డి, ఉపాధ్యాయుడు, తిరుపతి రూరల్‌

సాయం చేస్తామని.. చేతులెత్తేశారు!

గత ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులందరికీ ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామని, పని ఒత్తిడి లేకుండా నాణ్యమైన చదువులు పిల్లలకు అందించేలా చూస్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఇచ్చేస్తామన్నారు. ఏడాది గడిచినా ఇవ్వలేదు. – దేవేంద్ర,

ఉపాధ్యాయుడు, తొట్టంబేడు మండలం

మా డిమాండ్లను పరిష్కరించాల్సిందే

ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిందే. ప్రభు త్వం గురువులపై బాధ్యత గా వ్యవహరించాలి. బోధనకు పరిమితం చేసి పిల్లల భవిష్యత్తు బాగుపడేలా చూడాలి. అంతే తప్ప అనవసరమైన యాప్‌లను చేతికి అందించి అందులో ఫొటోలు పెట్టే బాధ్యతలు అప్పగించడం మంచిది కాదు. – ప్రభు, కార్యదర్శి, యూటీఎఫ్‌

రోడ్డెక్కే పరిస్థితికి తీసుకువచ్చారు

కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచింది. తమ సమస్యల గురించి ప్రస్తావించినా పాలకులు పట్టించుకోలేదు. తమ డిమాండ్లను తీర్చుకోవడానికి రోడ్డెక్కే పరిస్థితికి తెచ్చారు. ఇంత త్వరగా పోరాటం చేయాల్సి వస్తుందని అనుకోలేదు. అయినా మాకు తప్పడం లేదు. ఇలా చేయడం పాలకులకు న్యాయం కాదు. – డి.నిర్మల,

యూటీఎఫ్‌ నాయకురాలు, తిరుపతి

మాట ఇచ్చారు.. మరిచారు

ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఎన్నికలకు ముందు మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచారు. ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాల తరపున గుర్తు చేస్తున్నా లెక్క చేయడం లేదు. అందుకే రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ఉపాధ్యాయుల చూపించే నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నా. – అవనిగడ్డ పద్మజ,

యూటీఎఫ్‌ నాయకురాలు, తిరుపతి

మూల్యం తప్పదు

గురువులను బాధించే ఏ ప్రభుత్వమైనా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. బోధనకు దూరం చేసి బోధనేతర పనులు చేయించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి.

– రేణుకాదేవి, ఎస్‌టీయూ

జల్లా నాయకురాలు, తిరుపతి

ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళా ఉపాధ్యాయులు

తిరుపతి రూరల్‌: తిరుపతి నగరంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో టీచర్లు శనివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ, ఏఐఎస్‌టీఎఫ్‌ అధ్యక్షులు కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది గడిచినా ఒక్క సమస్యనూ పరిష్కరించలేదన్నారు. బోధనాపరమైన పనులను పక్కన పెట్టి, అనవసరమైన యాప్‌లను చేతికిచ్చి విద్యార్థులకు చదువులను దూరం చేస్తోందన్నారు. ప్రభుత్వం తన పారదర్శకతను చూపించాలనుకునే ముసుగులో విద్యార్థులకు చదువులను దూరం చేయించడం భావ్యం కాదన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం అన్ని విధాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఉపాధ్యాయుల డిమాండ్లు ఇవీ..

11వ పీఆర్సీ బకాయిలను చెల్లించాలి. 12వ పీఆర్సీ అమలుకు కమిటీ వేయాలి. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను విడుదల చేయాలి. రిటైర్డ్‌ అయిన ఉపాధ్యాయులకు ఇచ్చే అలవెన్సులు తక్షణం చెల్లించాలి. బోధనకు అంతరాయం కలిగిస్తున్న యాప్‌లను రద్దు చేయాలి. ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేయాలి. ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయాలి. అంతర్‌ జిల్లాల ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలి. ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయుల వేతనాలను సకాలంలో చెల్లించాలి.

నమ్మించి మోసం చేస్తోంది

ఉపాధ్యాయులుపై ప్రభుత్వం నిర్లక్ష్యం ధోరణి అవలంభిస్తోంది. ఎన్నికలకు ముందు అన్నీ చేస్తామని చెప్పి నమ్మించింది. ఇప్పుడు ఏదడిగినా సమాధానం లేకుండా మోసం చేస్తోంది. పది మందికి చదువుచెప్పే తమ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉంది. ఏ సమస్య చెప్పినా లెక్క చేయ డం లేదు. అందుకే ఐక్యతతో పోరాడుతున్నాం.

– పి.కవిత, యూటీఎఫ్‌ నాయకురాలు, తిరుపతి

కలిసికట్టుగా పోరాడుతున్నాం

ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వానికి పదే, పదే నివేదికలు అందించాం. పరిష్కరించాలని పలు మార్లు విజ్ఞప్తి చేశాం. అయినా లెక్క చేయలేదు. ఉపాధ్యాయులపై అగౌరవంగా వ్యవహరించే ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని పోరాడుతున్నాం. పోరాటంతోనే సాధించుకుంటాం.

– ఎస్‌.సురేష్‌,

ఫ్యాప్టో అధ్యక్షులు, తిరుపతి

దిగివచ్చేంత వరకు ఉద్యమిస్తాం

ఉపాధ్యాయుల సమస్యలపట్ల ప్రభుత్వం దిగివచ్చేంత వరకు ఉధ్యమిస్తాం. అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఏకమై చేస్తున్న ఈ పోరాటానికి ప్రభుత్వం దిగిరాకతప్పదు. ఉపాధ్యాయుల సమస్యలపై పాలకులు చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. అందుకే వీధుల్లోకి రావాల్సి వచ్చింది.

– బి.మధుసూదన్‌రెడ్డి,

యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి

విద్యార్థులు నష్టపోక తప్పదు

చదువులు చెప్పే ఉపాధ్యాయులు రోడ్డెక్కితే విద్యార్థులు నష్టపోక తప్పదు. ప్రభుత్వం ఇంత త్వరగా చెడ్డపేరు తెచ్చుకుంటుందని అనుకోలేదు. ఉపాధ్యాయు లే రోడ్డుపైకి వస్తే మిగతా వారి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆరు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఏడాది దాటినా ఏమీ అనుకోలేదు. అందుకే ఆందోళనలు చేయాల్సి వస్తోంది.

– శ్రీదేవి, యూటీఎఫ్‌ నేత, కేవీబీ పురం

కార్యకర్తలకు ఇచ్చిన గౌరవం కూడా లేదు

‘తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పల్నాడు జిల్లాలో ఓ టీడీపీ కార్యకర్తను మరో పార్టీ వారు చంపేస్తే..ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి క్యాబినెట్‌ ఆమోదం చేసి..రెండు నెలల్లో ఉద్యోగం ఇచ్చారు.. అదే ఒక ఉపాధ్యాయుడు అనారోగ్యంతోనో, ప్రమాదంలోనో చనిపోతే ఆ కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వడానికి సంవత్సరాల తరబడి వేచి చూడాలి.. ఒక కార్యకర్తకు ఇచ్చిన గౌరవం కూడా గురువులకు ఇవ్వలేరా..?’ అని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులకు చదువుకు తగ్గ ఉద్యోగం ఇచ్చే అధికారాన్ని జిల్లా కలెక్టర్‌కు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. కుటుంబ పెద్దగా ఉన్న ఉపాధ్యాయుడు చనిపోయిన రెండు నెలల్లో ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేలా నిబంధనలు సడలించాలని కోరారు. ఈ ధర్నాలో రాష్ట్ర ఉపాధ్యా య సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి చిరంజీవి, తిరుపతి అధ్యక్షుడు ఎస్‌.సురేష్‌, ముత్యాలరెడ్డి, జగ న్నాథం, నిర్మల, రేణుకా దేవి, వెంకటరమణ, మురళీ కృష్ణ, బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయులపై పాలకులకు నిర్లక్ష్యం తగదు 
1
1/11

ఉపాధ్యాయులపై పాలకులకు నిర్లక్ష్యం తగదు

ఉపాధ్యాయులపై పాలకులకు నిర్లక్ష్యం తగదు 
2
2/11

ఉపాధ్యాయులపై పాలకులకు నిర్లక్ష్యం తగదు

ఉపాధ్యాయులపై పాలకులకు నిర్లక్ష్యం తగదు 
3
3/11

ఉపాధ్యాయులపై పాలకులకు నిర్లక్ష్యం తగదు

ఉపాధ్యాయులపై పాలకులకు నిర్లక్ష్యం తగదు 
4
4/11

ఉపాధ్యాయులపై పాలకులకు నిర్లక్ష్యం తగదు

ఉపాధ్యాయులపై పాలకులకు నిర్లక్ష్యం తగదు 
5
5/11

ఉపాధ్యాయులపై పాలకులకు నిర్లక్ష్యం తగదు

ఉపాధ్యాయులపై పాలకులకు నిర్లక్ష్యం తగదు 
6
6/11

ఉపాధ్యాయులపై పాలకులకు నిర్లక్ష్యం తగదు

ఉపాధ్యాయులపై పాలకులకు నిర్లక్ష్యం తగదు 
7
7/11

ఉపాధ్యాయులపై పాలకులకు నిర్లక్ష్యం తగదు

ఉపాధ్యాయులపై పాలకులకు నిర్లక్ష్యం తగదు 
8
8/11

ఉపాధ్యాయులపై పాలకులకు నిర్లక్ష్యం తగదు

ఉపాధ్యాయులపై పాలకులకు నిర్లక్ష్యం తగదు 
9
9/11

ఉపాధ్యాయులపై పాలకులకు నిర్లక్ష్యం తగదు

ఉపాధ్యాయులపై పాలకులకు నిర్లక్ష్యం తగదు 
10
10/11

ఉపాధ్యాయులపై పాలకులకు నిర్లక్ష్యం తగదు

ఉపాధ్యాయులపై పాలకులకు నిర్లక్ష్యం తగదు 
11
11/11

ఉపాధ్యాయులపై పాలకులకు నిర్లక్ష్యం తగదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement