
నెలాఖరుకల్లా గ్రేవ్ కేసులు ఛేదించాలి
● జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ● పోలీసు అధికారులతో నేర సమీక్ష
తిరుపతి క్రైమ్ : ఈ నెలాఖరుకల్లా జిల్లాలో ఉన్న గ్రేవ్ కేసులను ఛేదించాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. ఆయన శనివారం పద్మావతి మహిళా యూనివర్సిటీలోని సావేరి అతిథి గృహంలో అర్ధ సంవత్సర నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రధానంగా గ్రేవీ కేసులు, ఎస్సీ, ఎస్టీ కేసులు, హౌస్ బ్రేకింగ్, వైట్ కలర్, మర్డర్ పర్ గేయిన్, రోడ్ యాక్సిడెంట్, ఎన్డీపీఎస్, సైబర్ నేరాలపై చర్చించామన్నారు.
● ఎస్టీ, ఎస్సీ కేసుల్లో వచ్చే ఫిర్యాదులు పూర్తిస్థాయిలో విచారించిన మీదట చర్యలు తీసుకోవాలన్నారు. ఈ చట్టాలపై పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
● దొంగతనాల నియంత్రణపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో 75 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. ఈ ఏడాదిలో డిటెక్షన్ 75 శాతం ఉండాలని, అదేవిధంగా రికవరీ 85 శాతం వరకు పెంచాలన్నారు. సైబర్ నేరాలు, వైట్ కలర్ నేరస్తులపై అప్రమత్తంగా వుండాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
హత్య కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
జిల్లా వ్యాప్తంగా మర్డర్ ఫర్ గెయిన్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి.. పురోగతి సాధించాలని పేర్కొన్నారు. డెకరేటివ్ కేసులు, దోపిడీ కేసులు పెండింగ్లో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కేసులన్నింటిని త్వరలో పూర్తి చేయాలన్నారు. రోడ్ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒక ప్రాణాన్ని కాపాడితే ఆ కుటుంబానికి మేలు చేసిన వాళ్లం అవుతామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలపై ఉక్కు పాదం మోపాలని ఆదేశించారు. సమావేశంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సంధ్యారాణి, కేదార్నాథ్, జయశేఖర్, ప్రేమ్ సాగర్, నిర్మల కుమారి, శిరీష, ఏఎస్పీలు రవి మనోహరాచారి, రామకృష్ణ, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.