
రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ జమ
శ్రీకాళహస్తి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అన్నదాత సుభీభవ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా శనివారం వారణాసి నుంచి పీఎం నరేంద్రమోదీ, రాష్ట్రం నుంచి సీఎం చంద్రబాబునాయుడు నగదు జమ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణం ఏపీసీడ్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి రైతులకు మెగా చెక్కు అందజేశారు. తిరుపతి జిల్లాలో 1,54,980 మంది రైతులకుగాను రూ.105 కోట్లు జమ చేశారు. వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు మొత్తం రూ.7 వేలు అర్హులైన ప్రతి రైతుకూ అందుతుందన్నారు. ఖాతాల్లో జమకాని అర్హులైన రైతులను పరిశీలించి త్వరలోనే అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, ఆర్డీఓ భానుప్రకాష్‌రెడ్డి, టీడీపీ నాయకులు, అదికారులు తదితరులు పాల్గొన్నారు.