అక్రమ అరెస్టులతో ప్రజాభిమానం ఆపలేరు | - | Sakshi
Sakshi News home page

అక్రమ అరెస్టులతో ప్రజాభిమానం ఆపలేరు

Aug 3 2025 8:38 AM | Updated on Aug 3 2025 8:38 AM

అక్రమ

అక్రమ అరెస్టులతో ప్రజాభిమానం ఆపలేరు

చిత్తూరు కార్పొరేషన్‌ : బంగారుపాళెంలో మామిడి రైతుల పరామర్శకు అధినేత జగనన్న వచ్చినప్పుడు ఓ పత్రికా ఫొటోగ్రాఫర్‌పై దాడి చేశారని, విజయానందరెడ్డి జన్మదినం సందర్భంగా నగరంలో కేక్‌ కట్‌ చేశారని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను జిల్లా జైలులో పెట్టారు. వీరిని శనివారం తిరుపతి, చిత్తూరు జిల్లాల పార్టీ అధ్యక్షుడు కరణాకరరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా జైలులో పార్టీ నాయకులు ఆను, కార్యకర్తలు చక్రవర్తి, వినోద్‌, మోహన్‌, అబ్దుల్‌, రాజేష్‌, అరుణ్‌, సతీష్‌, అల్తాఫ్‌, రఘుతో ములాఖత్‌ అయ్యారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు నాయకులను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. వారిని ఓదార్చి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడారు. బంగారుపాళ్యం ఘటనలో చక్రవర్తిని జులై 10న అరెస్టు చేసి 13న కోర్టులో ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. 13నే అదుపులో తీసుకున్నట్లు కోర్టులో చెప్పాలని పోలీసులు అతడిపై ఒత్తిడి తెచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. విజయానందరెడ్డి జన్మదిన వేడుకలను జరుపుకున్నారని తమ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేసి ఇళ్లు ధ్వంసం చేసి కేసులు పెట్టి జైలులో పెట్టారన్నారు. విజయానందరెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి అణచివేసేందుకు అధికార పార్టీ ఇలా కుట్ర పన్నుతోందన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం కూటమి నాయకులకు నచ్చడం లేదన్నారు. మానసికంగా వేధించడానికి ఇలాంటి అక్రమ కేసులు పెట్టించారన్నారు. కార్యకర్తల విచారణలో విజయానందరెడ్డి దాడి చేయించారని బాధితుల వద్ద తప్పుడు వాంగ్మూలం తీసుకోవాలని పోలీసులు ప్రయత్నించారని ఆరోపించారు.

అవినీతి పోలీసులపై చర్యలేవీ?

చంద్రబాబుకు అనుకూల పత్రికలో చిత్తూరు పోలీసుల అవినీతిపై కథనం వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బంగారుపాళ్యం టోల్‌గేటు వద్ద పోలీసులు ప్రైవేటు సైన్యంతో దారి దోపిడీ ముఠా అని పెట్టారని అభియోగించారు. వారు ఇచ్చిన సమాచారంతో వీరు గుట్కా, నిషేధిత పదార్థాల నిర్వాహకుల నుంచి లక్షలు దోచుకుంటున్నారన్నారు. అక్రమదారుల నుంచి లక్షలు దోచుకుంటున్నట్లు పత్రికల్లో వస్తున్న వాటిపై ఎస్పీ కఠినంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి చేయి బాగాలేకపోతే ఆయన బ్యాగ్‌ మోసినందుకు గన్‌మెన్‌ను సస్పెండ్‌ చేసిన విషయం గుర్తు చేశారు. స్మగ్లర్లతో బేరాలు చేసుకొని వసూళ్లు చేస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

కట్టమంచి చెరువు పరిశీలన

జిల్లా కేంద్రంలోని కట్టమంచి చెరువులో పూడిక తీత పనుల పేరిట భారీ ఎత్తున దోపిడీ జరుగుతోందని విజయానందరెడ్డి విమర్శించారు. శనివారం క్షేత్రస్థాయిలో చెరువు వద్ద జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలను విజయానందరెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు కరుణాకరరెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిలకు చూపించి సమస్యను తెలియజేశారు. రోజు లారీ, టిప్పర్లతో వందలాది లోడ్‌లు ఇటుక బట్టీలకు, గృహ, లే అవుట్ల నిర్మాణాలకు ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారన్నారు. వీటికి సరైన లెక్కా పక్కా లేకుండా చెరువులో అక్రమంగా మట్టిని అమ్ముకుంటున్నారన్నారు. వీటిపై మీడియాలో కథనాలు వచ్చినా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నరన్నారు. ఆయకట్టు సామర్థ్యం, జలవనరులశాఖ వారు ఇచ్చిన అనుమతి కంటే ఎక్కువగా మట్టి తరలిస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో వర్షాలకు, తుపాను, ఇతర కారణాలకు చెరువు కట్ట తెగిపోతే కట్టమంచి కొట్టుకుపోతుందని అభిప్రాయపడ్డారు. రోజు వందలాది లోడ్‌లు మట్టి తవ్వుతున్నారన్నారు. దీని ద్వారా ఎమ్మెల్యేకు లక్షల్లో ఆదాయం వస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ చంద్రశేఖర్‌, మొదలియార్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌, నాయకులు సూర్యప్రతాప్‌రెడ్డి, హరీషారెడ్డి, అంజలిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మురళీరెడ్డి, రాజేష్‌, వెంకట్‌రెడ్డి, గుణశేఖర్‌రెడ్డి, సుగుణశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

పెద్దిరెడ్డి గన్‌మెన్‌ను అకారణంగా సస్పెన్షన్‌ చేశారు మరి అవినీతి పోలీసులపై చర్యలేవీ? జిల్లా జైలులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో

ములాఖత్‌ అయిన భూమన కరుణాకరరెడ్డి, నారాయణస్వామి, విజయానందరెడ్డి

కట్టమంచి చెరువులో

ఇసుక అక్రమ తవ్వకాల పరిశీలన

అక్రమ అరెస్టులతో ప్రజాభిమానం ఆపలేరు 1
1/2

అక్రమ అరెస్టులతో ప్రజాభిమానం ఆపలేరు

అక్రమ అరెస్టులతో ప్రజాభిమానం ఆపలేరు 2
2/2

అక్రమ అరెస్టులతో ప్రజాభిమానం ఆపలేరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement