పాకాల: స్థానిక రైల్వేస్టేషన్‌లో రైలు కింద పడి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం పాకాలలో చోటు చేసుకుంది. స్థానిక రైల్వే పోలీసుల కథనం మేరకు.. అనంతపురం జిల్లా, ఉరవకొండ మండలం ఉండబండ గ్రామానికి చెందిన ప్రకాష్ కుమారుడు సురేంద్ర నరసాపూర్ ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన ట్రైన్ డ్రైవర్ బ్రేకులు వేసి రైలును నిలిపి వేశారు. ఈ ఘటనలో ఆత్మహత్యకు యత్నించిన యవకుడు స్వల్పంగా గాయపడ్డాడు. గాయపడిన సురేంద్రని చికిత్స నిమిత్తం పి.కొత్తకోట సీహెచ్‌సీకి తరలించి, వైద్యం అందించినట్లు చిత్తూరు ఇన్‌చార్జ్ ఆర్పీ ఎస్‌ఐ రత్నమాల తెలిపారు.