
యూపీఎస్‌సీ పరీక్షలకు పటిష్ట చర్యలు
తిరుపతి అర్బన్: యూపీఎస్‌సీ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని డీఆర్వో నరసింహులు తెలిపారు. పరీక్షలకు నిర్వహణపై కలెక్టరేట్‌లో శనివారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం పరీక్షలు రెండు సెంటర్లలో మాత్రమే నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అయితే 641 మంది అధ్యర్థులు పరీక్షలు రాయనున్నారని చెప్పారు. పేపర్–1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్–2 మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. తిరుపతిలోని శ్రీపద్మావతి బాలికల ఉన్నత పాఠశాల, ఎస్‌పీడబ్ల్యూ డిగ్రీ కళాశాల సమీపంలోని శ్రీపద్మావతి ఉమెన్స్ జూనియర్ కళాశాలలోని వింగ్–ఏలో పరీక్షలు ఉంటాయన్నారు. యూపీఎస్‌సీ అబ్జర్వర్ శరద్‌కుమార్ శ్రీ వాస్తవ, జాయింట్ సెక్రటరీ శివకుమార్ పాల్గొన్నారు.
పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగం కమిటీ నియామకం
తిరుపతి మంగళం : వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో పలువురిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా ఎ. కిషోర్‌కుమార్‌రెడ్డి (పూతలపట్టు), పి.సందీప్‌రెడ్డి(సత్యవేడు), ఎం.మధుసూదన్‌రెడ్డి(పుంగునూరు), టి.మల్లికార్జునగౌడ్(శ్రీకాళహస్తి), క్రిస్టియన్, మైనార్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఆర్.నందకుమార్(చిత్తూరు), చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కె.ఇ.అయప్పన్(నగిరి)కి చెందిన వారు నియమితులయ్యారు.