అదనం రాక.. | - | Sakshi
Sakshi News home page

అదనం రాక..

Aug 4 2025 5:28 AM | Updated on Aug 4 2025 5:28 AM

అదనం

అదనం రాక..

కార్డులున్న చోటే బియ్యం
● పక్క షాపులో ఇవ్వని డీలర్లు ● ఆగస్టు నుంచి డీలర్లకు అలాట్‌మెంట్‌ బియ్యమే

గతంలో ఇంటి వద్దకే వెళ్లి బియ్యం సరఫరా చేస్తున్న ఎండీయూ వాహనం (ఫైల్‌)

తిరుపతి అర్బన్‌: ఇక కార్డులున్న చోటే బియ్యం అనే కొత్త నిబంధనతో పేదలకు కష్టాలు తప్పవు. రాష్ట్రంలోని ఏ రేషన్‌ డీలర్‌ వద్దనైనా నిత్యావసర సరుకులు తీసుకునే వెసులుబాటును 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కల్పించారు. ఇందుకోసం డీలర్‌కు అడిషనల్‌గా 10 శాతం బియ్యం ఇచ్చేవారు. డీలర్‌ స్థానికేతరులైన రేషన్‌కార్డుదారులు వస్తే బియ్యం ఇచ్చి, మిగిలిన బియ్యాన్ని సివిల్‌ సప్లయి అధికారులకు చూపించేవారు. దీంతో స్థానిక రేషన్‌కార్డుదారులకే కాకుండా స్థానికేతర రేషన్‌కార్జుదారులకు సరుకులు తీసుకోవడానికి ఇబ్బందులు ఉండేవి కాదు.

34 మండలాలు ముగ్గురే సివిల్‌ సఫ్లై డీటీలు

జిల్లాలో 34 మండలాలుంటే కేవలం మూడు మండలాలకు మాత్రమే సివిల్‌ సఫ్లై డీటీలు ఉన్నారు. మిగిలిన 31 మండలాలకు డీటీలు లేరు. దీంతో డీలర్ల పనితీరును చూసే అధికారే కరువయ్యారు. దీంతో డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు జిల్లాలో 1,457 రేషన్‌ దుకాణాలుండగా 167 చోట్ల డీలర్లు లేరు. సమీపంలోని పక్క డీలర్‌కి ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. దీంతో సరుకుల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది.

ఎండీయూ వాహనాలు రద్దు...

వైఎస్సార్‌సీపీ సర్కార్‌లో ఐదేళ్లపాటు ఎండీయూ వాహనాల ద్వారా నేరుగా ఇంటికే వచ్చి కార్డుదారులకు సరుకులు ఇచ్చేవారు. అయితే కూటమి సర్కార్‌లో జిల్లాలోని 369 ఎండీయూ వాహనాలను రద్దు చేశారు. డీలర్‌ వద్దకే వెళ్లి సరుకులు తీసుకోవాలనే నిబంధన పెట్టారు.

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల

వారికే ప్రాధాన్యత

స్థానికంగా ఉన్న కార్డుదారులకు కాకుండా విజయనగరం, శ్రీకాకుళం జి ల్లాలకు చెందిన కార్డు దారులకే డీలర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ రెండు జిల్లాలకు చెందిన వారు బియ్యాన్ని డీలర్‌కే అమ్మేస్తున్నారా? లేదా బియ్యాన్ని తగ్గించి తీసుకుంటున్నారో తెలియడం లేదు. స్థానికంగా ఉన్న మాకు బియ్యం ఇవ్వడానికి స్టాక్‌ లేదని చెప్పేస్తున్నారు.

– పుష్పమ్మ, తిరుపతి

ఏ దుకాణంలోనైనా

సరుకులు ఇవ్వాలి

అన్‌లైన్‌ వ్యవస్థ ఉన్న నేపథ్యంలో రేషన్‌కార్డుదారుడు రాష్ట్రంలో తమకు అనుకూలంగా ఉన్న చౌక దుకాణానికి వెళితే సరుకులు ఇవ్వాల్సి ఉంది. అలాకాకుండా డీలర్లు స్థానికులకే ఇస్తామని చెప్పడం సరికాదు. కూటమి సర్కార్‌లో కొత్తగా పెట్టే రూల్స్‌ అందరికీ అమోదయోగ్యం ఉండాలే తప్ప...ఇబ్బందిగా ఉండకూదు.

–అంకయ్య, శ్రీకాళహస్తి మండలం

అందరికీ బియ్యం ఇవ్వాలి

బియ్యం కోసం డీలర్‌ వద్దకు వచ్చే ప్రతి కార్డుదారునికి బి య్యం ఇవ్వాలని ఆదేశాలు ఇ చ్చాం. 10 శాతం బియ్యాన్ని అ దనంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. వారికి ఇచ్చిన బియ్యం అయిపోతే, స్టాక్‌ లేకుంటే పౌరసరఫరాల శాఖ అ ధికారులకు సమాచారం ఇస్తే మళ్లీ గోడౌన్‌ నుంచి బి య్యం పంపుతాం. త్వరలో అన్ని మండలాలకు సివిల్‌ సఫ్లై డీడీలను నియమిస్తాం. – శేషాచలంరాజు,

పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి

అదనపు బియ్యం రద్దు ఏమిటి?

2009 నుంచి అదనంగా ఇస్తున్న 10 శాతం బియ్యాన్ని రద్దు చేయడం ఏమిటి? అదనంగా 10 శాతం బియ్యం ఇవ్వడం ద్వారా డీలర్లు ఎవరూ తమ షాపునకు వచ్చిన స్థానికేతరులకు బియ్యం ఇవ్వడానికి వీలుంటుంది. ఒకటి నుంచి 15వ తేదీ వరకు సరుకులు ఇచ్చిన తర్వాత మిగులు బియ్యాన్ని చూపుతారు. దాంతో ఎవరికీ ఇబ్బందులు ఉండవు. –శ్రీనివాసులు, వాకాడు మండలం

అందరికీ కార్డులు ఇవ్వాలి

రేషన్‌కార్డు కోసం దరఖా స్తు చేసుకున్న అందరికీ కార్డులు ఇవ్వాలని కోరుతున్నాం. కొత్తగా ఇప్పటివరకు జిల్లాలో 60వేల మంది రేషన్‌కార్డులకు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తుంది. వారికి న్యాయం చేయాలని కోరుతున్నాం. పౌరసరఫరాల శాఖను గాడిలో పెట్టడానికి అధికారుల పర్యవేక్షణ చాలా అవసరం అని భావిస్తున్నాం. – డీపీ యాదవ్‌, డక్కిలి మండలం

ఆగస్టు నుంచి 10 శాతం కట్‌

ఆగస్టు నుంచి రేషన్‌ డీలర్లకు అడిషనల్‌గా ఇస్తున్న 10 శాతం బియ్యాన్ని కట్‌ చేశారు. దీంతో 90 శాతం రేషన్‌ డీలర్లు తమ షాపు పరిధిలోని కార్డుదారులకు మాత్రమే బియ్యం ఇస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి బియ్యం కోసం తమ షాపునకు వస్తే అడిషనల్‌గా ఇస్తున్న 10 శాతం బియ్యాన్ని కూటమి సర్కార్‌ ఆపివేసిందని, స్థానికేతరులకు బియ్యం ఇవ్వలేమని తేల్చిచెప్పేస్తున్నారు. దీంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు.

అదనం రాక..1
1/6

అదనం రాక..

అదనం రాక..2
2/6

అదనం రాక..

అదనం రాక..3
3/6

అదనం రాక..

అదనం రాక..4
4/6

అదనం రాక..

అదనం రాక..5
5/6

అదనం రాక..

అదనం రాక..6
6/6

అదనం రాక..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement