
అసమర్థ పాలనకు నిదర్శనం
● ప్రభుత్వ హాస్టళ్లను నిర్వీర్యం చేసేందుకు కూటమి కుట్ర ● విద్యార్థి సంఘాలపై ఆంక్షలు విధించడం దారుణం
●
తిరుపతి సిటీ: కూటమి సర్కారు అసమర్థ పాలన బట్టబయలవుతోంది. ఇందులో భాగంగానే విద్యార్థులపై తన వితండవాదాన్ని రుద్దుతోంది. ప్రభుత్వ హాస్టళ్లలోకి, పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాలకు అనుమతి నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీన్ని నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆదివారం ఎమ్మార్‌పల్లిలో నిరసన ర్యాలీ చేశారు. వసతి గృహాల్లో తమ వైఫల్యాల్ని బయటకు పొక్కనీయకుండా బ్రేక్ వేయాలనే లక్ష్యంతో విద్యార్థి సంఘాలను విద్యాసంస్థలోనికి అనుమతించకూడదని జిల్లా అధికారులకు కూటమి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుబయట ఆత్మగౌరవం, పెచ్చులూడుతున్న భవనాలు, పడకేసిన పారిశుద్ధ్యం, కటిక నేల పట్టుపాన్పు, పౌష్టికాహార లేమితో విద్యార్థులు అవస్థ పడుతున్న వాస్తవాలను వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులతోపాటు పలు విద్యార్థి సంఘాలు వెలుగులోకి తెచ్చాయి. దీంతో వాస్తవాలను బయట పెడతారా? అంటూ ప్రభుత్వం విద్యార్థి సంఘాలకు అనుమతి ఇవ్వరాదంటూ అధికారులకు హుకుం జారీ చేసింది.
భగ్గుమన్న విద్యార్థి లోకం
ప్రభుత్వ ఆంక్షలపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో తిరుపతి ఎమ్మార్‌పల్లి సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులను తగులపెట్టి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. పాలన చేతకపోగా ప్రశ్నించి వారిపై కక్ష్యసాధింపు చర్యలు తీసుకోవడం అసమర్థపాలనకు నిదర్శనమని మండిపడ్డారు. తక్షణం ఆ ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాలతో ప్రభుత్వం మెడలు వంచక తప్పదని హెచ్చరించారు.
ప్రభుత్వంపై తిరుగుబాటు తథ్యం
కూటమి ప్రభుత్వం వసతిగృహాలు, పాఠశాలలను సర్వనాశనం చేసింది. విద్యార్థి సంఘాలు సంక్షేమ హాస్టళ్లను విజిట్ చేసి న సందర్భంగా ప్రభుత్వం డొల్లతనం బయటపడింది. దీంతో కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లాలోని అన్ని వసతి గృహాలను జల్లెడపట్టి అక్కడి పరిస్థితులపై జిల్లా అధికారులకు తెలియజేసింది. దీంతో కూటమి సర్కారు ఇలాంటి దారుణమైన ఉత్తర్వులు జారీ చేయడం ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనం.–డాక్టర్ బి ఓబుల్ రెడ్డి,
వైఎస్సాఆర్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు
కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసే
ప్రయత్నమే
ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాసేందుకే విద్యార్థి సంఘాలపై ఆంక్షలు విధించింది. రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోంది. పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతోంది. విద్యార్థి సంఘాలను పాఠశాలలు, వసతిగృహాల్లోకి అనుమతించకుండా చేయడమంటే అవినీ తిని ప్రొత్సహించడమే. వెంటనే ఉత్తర్వులను వెనక్కి తీసుకకపోతే విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.
–రవి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి, తిరుపతి
ఆంక్షలతో ఉద్యమాలను ఆపలేరు!
విద్యార్థి సంఘాలపై కూ టమి ప్రభుత్వం ఆంక్షలు విధించడం దారుణం. ఇ లాంటి ఆంక్షలతో ఉద్యమాలను ఆపలేరు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి దుర్మార్గపు నిర్ణయాలు ఏ ప్రభుత్వం తీసుకోలేదు. పాఠశాల విద్యను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. అందులో భాగంగానే ఇలాంటి ఆంక్షలతో ఉత్తర్వులు జారీ చేస్తోంది. పునరాలోచించి ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలి.
–శివారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యదర్శి
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆంక్షలు విధిస్తారా!
పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో మౌళిక వసతులపై విద్యార్థి లోకం గళమెత్తితే ప్రభుత్వం తప్పుగా భావించి ఆంక్షలు విధించడం దారుణం. ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టల్స్‌లో మనుషులు నివాసముండే పరిస్థితి లేదు. అత్యంత దారుణంగా వసతల లేమితో, నాసిరకం ఆహారంతో విద్యార్థులు నరకకూపంలో జీవిస్తున్నారు. వీటిపై విద్యార్థుల సంఘాలు ప్రశ్నిస్తే వారిపై కక్ష్య సాధింపు చర్యలు దిగడం, పాఠశాలలోకి అనుమతులు ఇవ్వదని అధికారులకు హుకుం జారీ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. వెంటనే ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని లేదంటే పోరాటాలకు సిద్ధమవుతాం.
–ఆర్ ఆష, పీడీఎస్‌ఓ జిల్లా కార్యదర్శి, తిరుపతి
విద్యార్థి సంఘాలతో పెట్టుకోవడం ప్రమాదకరం
కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలలో భాగంగా విద్యార్థుల సమస్యలపై నోరువిప్పే విద్యార్థి సంఘాలపై సైతం తన ప్రతాపాన్ని చూపుతోంది. విద్యార్థి సంఘాలతో పెట్టుకుంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. పాఠశాలలోనూ, వసతిగృహాలలోనూ విద్యార్థులు నరకయాతన పడుతున్నారు. పౌష్టికాహారం అందక, కనీసం నిద్రించేందుకు సదుపాయాలు లేకుండా అరకొర వసతులతో మగ్గుతున్నారు. వీటిపై ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగడం దారుణం. ఆంక్షలు విధించి ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రభుత్వం భయపడినట్టు స్పష్టమైంది.
– శివశంకర్ నాయక్, జీఎస్‌ఎన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షలు
విద్యార్థి సంఘాలపై కక్ష్య సాధింపు ప్రమాదకరం
ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు ప్రజాస్వామానికి గొడ్డలిపెట్టు వంటివి. విద్యార్థి సంఘాలు విద్య వ్యవస్థలోని లోపాలు, సమస్యలపై ప్రశ్నించకపోతే పాఠశాలలు, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ హాస్టల్స్ అత్యంత దారుణంగా తయారవుతాయి. విద్యార్థుల నోరు మూయిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ప్రభుత్వ మనుగడ సైతం కష్టమయ్యే పరిస్థితి నెలకొంటుంది. విద్యావ్యవస్థను కాపాడుతోంది కేవల విద్యార్థి సంఘాలే అని చెప్పవచ్చు.
– సంపూర్ణమ్మ, విశ్రాంత అధ్యాపకులు, తిరుపతి
విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతోంది. వసతి గృహాలు, పాఠశాలలోకి విద్యార్థి సంఘాలకు అనుమతులు లేకుండా కట్టడి చేయడంతోనే కూటమి ప్రభుత్వ కుట్ర తేటతెల్లమైంది. అక్కడ జరగుతున్న పరిస్థితులను విద్యార్థి సంఘాలు నిలదీయడంతో ప్రభుత్వం ఏమి చేయాలో పాలుపోకుండా ఆంక్షలు విధిస్తూ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. కక్ష్య సాధింపు చర్యలలో భాగంగానే ఇలాంటి దుచర్యలకు పాల్పడుతోంది. బడుగు బలహీన వర్గాలు చదువుకునే ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్‌ను అభివృద్ధి చేసి, మౌళిక వసతులను కల్పించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడం దారుణం. –రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ టీచర్, తిరుపతి

అసమర్థ పాలనకు నిదర్శనం

అసమర్థ పాలనకు నిదర్శనం

అసమర్థ పాలనకు నిదర్శనం

అసమర్థ పాలనకు నిదర్శనం

అసమర్థ పాలనకు నిదర్శనం

అసమర్థ పాలనకు నిదర్శనం

అసమర్థ పాలనకు నిదర్శనం