
డీలర్లకు బంపర్ ఆఫర్
అర్బన్ ప్రాంతాల్లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన పేదలు భవన నిర్మాణ కార్మికులుగా జిల్లాకు పెద్ద సంఖ్య వచ్చి ఉన్నారు. వీరు రేషన్ డీలర్ వద్దకు వెళ్లి బియ్యం ఇవ్వమని అడగ్గా స్థానికేతరులకు ఇవ్వడం కుదరని చెప్పడంతో తమకు వచ్చే బియ్యంలో ఒక కేజీ తగ్గించి ఇవ్వమని కోరుతున్నారు. దీంతో డీలర్లు స్థానికేతరులైన వారికి బియ్యం తగ్గించి ఇస్తున్నారు. చివరిగా వచ్చే స్థానికులకు బియ్యం ఇవ్వడం లేదు. ఇటీవల ఈ అంశంపై సీపీఎం నేతలు జిల్లా సివిల్ సఫ్లై అధికారుల వద్ద నిరసన వ్యక్తం చేశారు.