తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు కలగా కల్పనగా మిగిలిపోయింది. రైల్వే డివిజన్ కోసం తిరుపతి ఎంపీ గురుమూర్తి కృషి చేసినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రయాణికులు, స్థానికుల ఆశలు అడియాసలయ్యాయి.
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుపతిలో రైల్వే డివిజన్ ఏర్పాటు ఇక లేనట్టే. తాజాగా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కొంతకాలంగా వినిపిస్తోంది. ఎంపీ గురుమూర్తి కూడా పలుసార్లు రైల్వేబోర్డు దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. పార్లమెంట్ సమావేశాల్లోనూ తిరుపతి రైల్వే డివిజన్ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలోనే రైల్వే డివిజన్ ఏర్పాటుపై రైల్వేబోర్డు స్పందించింది. ఈ మేరకు తిరుపతి ఎంపీ గురుమూర్తికి రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ లేఖ రాశారు. ఈ లేఖపై తిరుపతిలో కొత్త రైల్వే డివిజ న్ ఏర్పాటు సాధ్యం కాదని, రైల్వే బోర్డు చైర్మన్ స్పష్టం చేశారు. రైల్వే డివిజన్ ఏర్పాటుకు ఫీజబులిటీ లేదన్న రైల్వే బోర్డు గతంలోనూ కొన్ని కమిటీలు ఈ విషయంపై ఎలాంటి సిఫార్సులు చేయలేదని పేర్కొంది.
ప్రయాణికుల ఆశలపై నీళ్లు
బాలాజీ రైల్వే డివిజన్ పేరుతో తిరుపతిలో నూతన రైల్వే డివిజన్ ఏర్పాటుపై ప్రయాణికులు పెట్టుకున్న ఆశలపై రైల్వేబోర్డు నీళ్లు చల్లింది. తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం కావడంతో ఇక్కడి నుంచి నిత్యం చైన్నె, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై న్యూఢిల్లీ తదితర ప్రాంతాలకు రైళ్లు నడుస్తాయి. ఈ నేపథ్యంలో తిరుపతి రైల్వేస్టేషన్‌కు శ్రీవారి భక్తులతోపాటు అత్యధిక సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారు. ఈ క్రమంలో తిరుపతిని రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయాలని స్థానికులతోపాటు ప్రయాణికులు కోరుతున్నారు. ఈ విషయంపైనే పలుసార్లు ఎంపీలు గురుమూర్తి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చారు.
బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు లేనట్టే!
రైల్వే బోర్డు కీలక నిర్ణయం
సాధ్యం కాదంటూ ఎంపీ గురుమూర్తికి లేఖ
కలగా మిగిలిపోనున్న ప్రయాణికుల ఆశలు
రైల్వే అభివృద్ధికి కృషి
తిరుపతి పార్లమెంట్ పరిధి లో రైల్వేస్టేషన్ల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తున్నా. ఈ క్రమంలో తిరుపతి రైల్వేస్టేషన్‌లో రూ.300 కోట్లతో రెండేళ్ల కిందట అభివృద్ధి ప నులు చేపట్టిన విషయం తెలిసిందే. తిరుపతి నగర పరిధిలోని రేణిగుంట మార్గంలో రెండు రైల్వే అండ ర్ బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చాను. అలాగే ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పాత తిరుచానూరు మార్గంలో ప్రజల సౌకర్యార్థం రాకపోకలకు వీలుగా ఫుట్‌ఓవర్ బ్రిడ్జి, రాయల చెరువు రోడ్డు లోని రైల్వే అండర్ బ్రిడ్జి విస్తరణకు కృషి చేశాను. బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటుకు చేసిన కృషిపై రైల్వే బోర్డు నుంచి ప్రతికూలంగా స్పందించిన తీరు సీమ వాసుల ఆశలకు అడ్డుకట్ట పడింది.
– మద్దెల గురుమూర్తి, ఎంపీ, తిరుపతి
కలగా.. కల్పనగా..!
కలగా.. కల్పనగా..!