
ఒంటరి ఏనుగు సంచారం
పాకాల: మండలంలోని చింతలవంక, వళ్లివేడు పరిసర ప్రాంతాల్లో ఒంటరి ఏనుగు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ఆదివారం గుర్తించారు. వారు మాట్లాడుతూ స్థానిక గ్రామాలతోపాటు కొమ్మిరెడ్డిగారిపల్లి క్రాస్‌రోడ్డు నుంచి కొత్తపల్లికి వెళ్లే రోడ్డు మార్గంలో రాత్రి పూట ప్రయా ణం చేయకూడదని సూచనలు చేశారు. రాత్రి సమయాల్లో కాకర్లవారిపల్లి, మొరవపల్లి, పుల్లావాండ్లపల్లి, కొండకిందపల్లి, నడుంపల్లి, పరిసర ప్రాంతాల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నా యని రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. రాత్రి సమయాల్లో రైతులు పొలాల వద్ద బస చేయడం, వ్యవసాయ పనులు చేయడం వంటివి చేయకూడదని, చీకటి పడిన తరువాత పొలాల నుంచి ఇంటికి వచ్చేయాలని, ఒంటరి ఏనుగు సంచారంపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఏనుగు సంచారంపై సమాచారాన్ని 8309255631 నంబర్‌కు తెలియజేయాలని అటవీశాఖ అధికారులు కోరారు.
యువకుడి ఆత్మహత్య
గూడూరురూరల్: రైల్వేస్టేషన్ సమీపంలో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం జరిగింది. గూడూరు రైల్వే పోలీసుల కథనం మేరకు.. సైదాపురం మండలం తూర్పు పూండ్ల గ్రామానికి చెందిన పొట్టేళ్ల పోలయ్య, వెంకటమ్మ కుమారుడు రాజ్‌కుమార్(26) గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం రైల్వేస్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫారం సమీపంలో న్యూజల్‌పాయ్‌గురి నుంచి చైన్నె వైపు వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడడంతో తల, మొండెం వేరయ్యాయి. మృతుడి వద్ద ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో
వృద్ధుడి మృతి
నాయుడుపేటటౌన్: పట్టణంలోని పాత ట్రెజరీవీధిలో రహదారి వద్ద చింతగుంట సుబ్బయ్య(70) అనుమానాస్పదంగా మృతి చెంది పడి ఉండడాన్ని స్థానికులు ఆదివారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల కథనం మేరకు.. గుడూరు రూరల్ మండలం చెన్నూరు గ్రామానికి చెందిన సుబ్బయ్య నాయుడుపేట పట్టణంలోని అగ్రహర పేటలో ఉన్న బంధువులను చూసేందుకు శనివారం వచ్చాడు. ఈక్రమంలో పట్టణ పరిధిలోని పాత ట్రెజరీ వీధిలో రోడ్డు పక్కన తీవ్ర గాయాలతో మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. సుబ్బయ్యను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడికి బంధువైన పట్టణానికి చెందిన మాసారం రాధకృష్ణా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఒంటరి ఏనుగు సంచారం