
బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేయాలి
తిరుపతి అర్బన్ : బాల్యవివాహాల నిర్మూలనకు ఽఅధికారులు సమష్టిగా కృషి చేయాలని బాలల హక్కుల పరిరక్షణ సంఘం సభ్యురాలు పద్మావతి వెల్లడించారు. కలెక్టరేట్‌లో గురువారం ఆమె అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఏ పరిధిలో వారు బాల్య వివాహాలకు ఎక్కడికక్కడే అడ్డుకట్టవేయాలని పేర్కొన్నారు. బాలికతో పాటు వారి తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. మరోవైపు విద్యార్థి దశ నుంచే బాల్య వివాహాలతో వచ్చే అనర్థాలపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని చెప్పా రు. మరోవైపు బాలల హక్కులను వందశాతం అమ లు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. పిల్ల ల ట్రాఫింగ్, డ్రాప్ అవుట్స్, అశ్రద్ధ, బాల కార్మికుల పరిస్థితులపై ఎప్పటికప్పుడు అన్వేషణ చేయాల్సి ఉందని తెలిపారు. పాఠశాల పరిధిలోనే 12 రకాల కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. చైల్డ్ ప్రొటెక్షన్, హెల్త్ అండ్ హైజీన్, స్కూల్ మానిటరింగ్, పీడీఏ కమిటీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ గౌరీశంకర్‌రావు, ఐసీడీఎస్ పీడీ వసంత బాయి, కేజీబీవీ, రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.