పేదలను చంద్రబాబే దత్తత తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పేదలను చంద్రబాబే దత్తత తీసుకోవాలి

Jul 30 2025 7:08 AM | Updated on Jul 30 2025 7:08 AM

పేదలను చంద్రబాబే దత్తత తీసుకోవాలి

పేదలను చంద్రబాబే దత్తత తీసుకోవాలి

● సంపన్నులను ఒప్పించాలంటూ ఉద్యోగులపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది ● పీ–4 పేరుతో టీడీపీ ఎమ్మెల్యేల వసూళ్ల పర్వం ● ఒక్క మంత్రి కూడా పీ–4లో ఎందుకు దత్తత తీసుకోలేదు ? ● పేదలను ముష్టివాళ్లుగా చిత్రీకరించకండి ● ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన

సాక్షి ప్రతినిధి, తిరుపతి : ‘‘కూటమి ప్రభుత్వం పీ–4 పేరిట ప్రభుత్వ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి చేస్తుంది. సచివాలయ సిబ్బందికి సరిగా జీతాలే ఇవ్వకుండా.. వారిపై ఒక్కొక్కరు ఒక్కో కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని విపరీతమైన ఒత్తిడి తెస్తోంది. రాష్ట్రంలో ఉన్న పేదలందరినీ సీఎం చంద్రబాబే దత్తత తీసుకోవాలి’’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి డిమాండ్‌ చేశారు. తిరుపతిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో విఫలమైన చంద్రబాబు వారి దృష్టి మరల్చేందుకు కొత్తగా పీ–4 కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా దత్తత తీసుకోవాలని కలెక్టర్ల ద్వారా ఒత్తిడి చేయించడాన్ని ఆక్షేపించారు. పీ–4 పేరుతో కూటమి ఎమ్మెల్యేలు దోపిడీకి తెరతీశారని భూమన మండిపడ్డారు.

ఉద్యోగుల్లో అలజడి..

గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన నాడు–నేడు ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల నిర్మాణం, ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, పిల్లలకు నాణ్యమైన విద్య, అర్హులైన పేదలందరికీ ఇళ్లు వంటి గొప్ప కార్యక్రమాలను చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా చెరిపేసే కార్యక్రమం చేపట్టారని ఆరోపించారు. పీ–4 కార్యక్రమం రాష్ట్రంలో అలజడి సృష్టిస్తోందన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఒక్కరు కూడా దత్తత తీసుకున్నది లేదని.. వాళ్ల అనుకూల పత్రికల్లోనే ఎమ్మెల్యేలు పీ–4 కార్యక్రమంలో భాగంగా వసూళ్లు కార్యక్రమం ప్రారంభించారని వార్తలు రాశారని గుర్తు చేశారు. సమావేశంలో మేయర్‌ శిరీష, పార్టీ నేతలు పాల్గొన్నారు.

పీ–4 అంటూ చంద్రబాబు కొత్త ప్రవచనాలు ..

సీఎం చంద్రబాబు నాయుడు గత రెండు, మూడు నెలలుగా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుస్తానని భీకర, భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నాడని.. ప్రపంచాన్ని మార్చడానికి పీ–4 అనే కొత్త సిద్ధాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మీద వదలడానికి సంసిద్ధులయ్యారని భూమన అన్నారు. పబ్లిక్‌, ప్రైవేటు, పీపుల్‌ పార్టనర్‌ షిప్‌ (పీ–4) కార్యక్రమాన్ని ప్రచారంతో ఊదరగొడుతున్నారని.. ఇందులో భాగంగా ధనికులంతా పేదవారికి సహాయం చేయాలని ఆయన ప్రవచిస్తున్నారని తెలిపారు. ఈ రాష్ట్రంలో కేవలం 20 లక్షలు పేద కుటుంబాలు మాత్రమే ఉన్నట్టు.. వారిలో 5.80 లక్షల మందిని గుర్తించగా.. ఇంకో 15 లక్షల మందిని గుర్తించాల్సిందిగా జిల్లా కలెక్టర్ల మీద ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్లు దిగువనున్న ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలమీద విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఈ దేశంలో 80 శాతానికిపైగా ఆర్థిక (సంపద) కేవలం 20 శాతం మంది చేతుల్లోనే ఉందని.. చంద్రబాబు చెబుతున్నట్టు పేదరికంలో 20 లక్షల కుటుంబాలే కాదు.. రెండు మూడు రెట్లకు పైగా ఉన్నారని, అలా రాష్ట్రంలో ఉన్న దాదాపు కోటి కుటుంబాలకు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముందు చూపుతో తన ఐదేళ్ల పాలనలో రూ.2.85లక్షల కోట్లు అందించి వారిని ఆర్థికంగా ఉన్నతస్థితిలోకి తీసుకురావడానికి కృషి చేశారని గుర్తు చేశారు. దాదాపు రూ.55 వేల కోట్లతో 25 లక్షల ఇళ్లు నిర్మించే బాధ్యత కూడా వైఎస్‌ జగన్‌హన్‌ రెడ్డి తీసుకున్నారని.. అది నిజమైన రాజకీయ తత్వవేత్త ఆలోచన చేయాల్సిన విషయం అన్నారు.

మరోవైపు ఎకై ్సజ్‌ ఉద్యోగులపై ఒత్తిడి పెట్టి బార్‌, వైన్‌ షాపుల యజమానులను మార్గదర్శకులుగా మార్చే కార్యక్రమం చేయడం అత్యంత ఆశ్చర్యకరం అన్నారు. ఎకై ్సజ్‌ ఉద్యోగుల ద్వారా షాపు యజమానులపై ఒత్తిడి పెడితే వాళ్లు మద్యం ధరలను మరింత పెంచుకుంటూ పోతారని ఆరోపిచంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement