తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కే ప్రయాణికులు రెండుసార్లు తీసుకోవాల్సి వస్తుండడంతో ప్రయాణం ఇబ్బందిగా మారింది.
షార్ కేంద్రం నుంచి ‘నిసార్’.. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–16 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ గగన తలంలోకి విజయవంతంగా దూసుకెళ్లడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. దేశంలో మొట్టమొదటిసారి ఇస్రో–నాసా సంయుక్తంగా రూపొందించిన ‘నిసార్ 102 ప్రయోగం విజయవంతంగా కక్ష్యలోకి దూసుకెళ్లడంతో జయహో భారత్ అంటూ షార్‌లోని గ్యాలరీ వీక్షకుల కరతాళధ్వనులతో హోరెత్తింది. శాస్త్రవేత్తలకు దేశం నలుమూలల నుంచి అభినందనలు మిన్నంటాయి.
ఇస్రో, నాసా సంయుక్త ప్రయోగం
● భూమి ఉపరితల పరిశీలన, వాతావరణ మార్పులపై అధ్యయనం ● విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు ● భారత్–అమెరికా దేశాల సహకారంలో ఇదో మైలురాయి ● గ్యాలరీలో వీక్షకుల కేరింతలతో సందడి
గురువారం శ్రీ 31 శ్రీ జూలై శ్రీ 2025
– 8లో
ఇస్రో శాస్త్రవేత్తలకు
అభినందనలు
శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్16 ప్రయోగం విజయవంతం కావడంతో ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రో–నాసా కలిసి చేసి మొదటి ప్రయోగాన్ని విజయవంతం చేయడంతో ఇస్రో చైర్మన్ డాక్టర్ వీ.నారాయణన్, షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్‌కు ఇతర శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రపంచమే గర్వించదగిన రాకెట్ కేంద్రం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉండడం దేశానికి గర్వకారణమన్నారు.
నింగిలోకి దూసుకెళ్తున్న రాకెట్
సూళ్లూరుపేట : సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–16 ప్రయోగాన్ని బుధవారం సాయంత్రం 5.40 గంటలకు విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయో గాన్ని 18.40 నిమిషాల్లోనే ముగించి 2,392 కిలోలు బరువు కలిగిన నిసార్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భూమి ఉపరితలం పరిశీలన, వాతావరణ మార్పులపై అధ్యయనం లాంటి వాటికి వినియోగించుకునేందుకు ఈ డ్యూయెల్ సింథటిక్ అపార్చర్ రాడార్ ఉపగ్రహాన్ని ప్రయోగించా రు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) మొదటిసారిగా కలిసిన చేసిన ప్రయోగం కావడం విశేషం. షార్ కేంద్రం నుంచి బుధవారం నిర్వహించిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–16 ప్రయోగంతో జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 18 ప్రయోగాలను పూర్తి చేశారు. ఇస్రో ప్రయోగాల పరంపరలో ఎన్నో మైలురాళ్లు దాటినప్పటికీ వంద ప్రయోగాల మైలురాయిని దాటి 102 ప్రయోగాలను పూర్తి చేశారు.
– 8లో
న్యూస్‌రీల్
జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–16 ప్రయోగ తీరును పరిశీలిస్తే..
జీఎస్‌ఎల్‌వీ ఎప్–16 రాకెట్‌కు మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. 27.30 గంటల కౌంట్‌డౌన్ సమయంలో రాకెట్‌లోని లిక్విడ్ స్ట్రాపాన్ బూస్టర్లు, రెండోదశలో ధ్రవ ఇంధనాన్ని నింపే ప్రకియను చేపట్టారు. బుధవారం సాయంత్రం 5.40 గంటలకు ప్రయోగాన్ని ప్రారంభించి 18.40 నిమిషాల్లో ప్రయోగాన్ని పూర్తి చేశారు.
కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే 0.00 నిమిషాలకు కోర్ అలోన్ దశలో 139 టన్నుల ఘన ఇంధనం, రాకెట్‌కు చుట్టూరా ఉన్న నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 160 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి మొదటిదశను 152 సెకెండ్లకు పూర్తి చేశారు.
మొదటి దశకు రెండో దశకు మధ్యలో రాకెట్ శిఖరభాగంలో ఉపగ్రహాన్ని అమర్చిన హీట్‌షీల్డ్స్ 171.8 సెకెండ్లకు విడిపోయాయి. రాకెట్‌లోని రెండోదశను 149.6 సెకెండ్లకు మండించి 284.1 సెకెండ్లకు పూర్తి చేశారు.
రాకెట్‌లోని మూడోదశ అంటే క్రయోజనిక్ దశను 294.06 సెకెండ్లకు మండించి 1100 సెకెండ్లకు కటాఫ్ చేశారు.
ఆ తరువాత 1120 సెకెండ్లకు (18.40 నిమిషాలు) 2,292 కిలోలు బరువు కలిగిన నిసార్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.
ఒక రైలు.. రెండు టికెట్లు
ఒక రైలు.. రెండు టికెట్లు
ఒక రైలు.. రెండు టికెట్లు
ఒక రైలు.. రెండు టికెట్లు
ఒక రైలు.. రెండు టికెట్లు