
హోరాహోరీగా ముగిసిన క్రికెట్ పోటీలు
తిరుపతి ఎడ్యుకేషన్ : తుమ్మలగుంట క్రీడా మైదానంలో గత రెండు రోజులుగా నిర్వహించిన అండర్–14, 17 జిల్లాస్థాయి టెన్నీస్ బాల్ క్రికెట్ పోటీలు బుధవారం ముగిశాయి. ఈ పోటీలకు రెండు విభాగాల నుంచి వివిధ పాఠశాలలకు చెందిన 14 జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో అండర్–14 విభాగంలో లిటిల్ ఏంజెల్స్ పాఠశాల జట్టు విజేతగా నిలువగా, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జట్టు రన్నరప్‌గా, సోక్రటీస్, నాగార్జున పబ్లిక్ స్కూల్ జట్లు తృతీయ స్థానంలో నిలిచాయి. అలాగే అండర్–17 విభాగంలో ఇంటర్ నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జట్టు విజేతగా, రెయిన్‌బో స్కూల్ టీం రన్నరప్‌గా, జీఎస్‌ఆర్ మాగ్నటిక్, లిటిల్ ఏంజెల్స్ స్కూల్స్ జట్లు తృతీయ స్థానం సాధించాయి. గెలుపొందిన జట్లకు, బెస్ట్ క్రికెటర్లకు లక్ష్మీ చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ కొప్పర్ల దివాకర్ చేతుల మీదుగా ట్రోఫీలు, సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో టెన్నీస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎ.దేవరాజ్, ప్రధాన కార్యదర్శి మనోహర్, కోశాధికారి కె.హేమంత్ కుమార్, క్రీడాకారులు పాల్గొన్నారు.

హోరాహోరీగా ముగిసిన క్రికెట్ పోటీలు