
సమష్టిగా పనిచేయాలి
● ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతిని సాధించేలా పనిచేయాలి ● డీఈఓ కేవీఎన్ కుమార్
నాయుడుపేటటౌన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు సమష్టిగా పనిచేయాలని తిరుపతి డీఈఓ కేవీఎన్ కుమార్ సూచించారు. నాయుడుపేట విశ్వం జూనియర్ కళాశాలలో మంగళవారం గూడూరు డివిజన్‌లోని ఎంఈఓలు, క్లస్టర్ హెచ్‌ఎంలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచాలన్నారు. ప్రభుత్వ సూచించిన మేరకు నూతన విద్యావిధానాలను విద్యార్థులకు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం సమయంలో ప్రత్యేక తరగతులను నిర్వహించాలని, వంద శాతం ఉత్తీర్ణతతో పాటు మంచి ఫలితాలు సాధించేందుకు ముందు నుంచే ప్రణాళికలను రూపొందించాలన్నా రు. పాఠశాలలో విధి విధానాలపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఈ సమావేశంలో గూడూరు డీవైఈఓ సనత్ కుమార్, జిల్లా అడిషన ల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ గౌరీ ఽశంకర్, అకడమిక్ మానిటరింగ్ అధికారి శివశంకర్ పాల్గొన్నారు.