
పోలీసు కుటుంబానికి రూ.కోటి బీమా
తిరుపతి క్రైమ్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఎస్‌ఐ కుటుంబానికి బీమా మొత్తం రూ.కోటి మొత్తానికి సంబంధించిన డీడీని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం బాధితులకు అందజేశారు. ఈ ఏడాది మార్చి 12వ తేదీన ఏఎస్‌ఐ గురుస్వామి వరమాలపేట వద్ద విధుల నిర్వహిస్తూ ఇంటి కెళ్లే క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే స్టేట్ బ్యాంకులో శాలరీ అకౌంట్ కలిగి ఉండడంతో ప్రమాద బీమా రూ.కోటి మంజూరు అయ్యింది. ఆ మొత్తానికి సంబంధించిన డీడీని జిల్లా ఎస్పీ చేతుల మీదుగా మృతుడు భార్య చిట్టెమ్మకు అందజేశారు.
3న బాల్‌బ్యాడ్మింటన్
జిల్లా జట్ల ఎంపిక
శ్రీకాళహస్తి: పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాల మైదానంలో ఆగస్టు 3వ తేదీ ఉదయం 8 గంటలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ సబ్ జూనియర్స్, సీనియర్స్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి బాలాజీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో క్రీడాకారులు జనవరి 2, 2010 తరువాత జన్మించి ఉండాలన్నారు. సెలక్షన్‌కు వచ్చే క్రీడాకారులు తమ వెంట ఆధార్‌కార్డు, బ్లడ్ గ్రూప్ తప్పని సరిగా తీసుకురావాలన్నారు. డ్రెస్‌కోడ్ పాటించాలని తెలిపారు. ఎంపికలో చిత్తూరు జిల్లా బాల్‌బ్మాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటస్వా మి, చైర్మన్ జగన్నాథంనాయుడు, అసోసియేషన్ సభ్యులు పాల్గొంటారని చెప్పారు. మరిన్ని వివరాలకు 7013754776, 9848295471 నంబర్లలో సంప్రదించాలన్నారు.
భూసేకరణ వేగవంతం చేయండి
తిరుపతి అర్బన్: చైన్నె– బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌కు సంబంధించి భూసేకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమ వారం ఆయన జేసీ శుభం బన్సల్‌తో కలసి భూసేకరణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసేకరణ పనుల్లో పురోగతి చూపాలని ఆదేశించారు. ప్రధానంగా రోడ్ల పనులను పూర్తి చేసి, అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే వాటికి పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయ్‌భరత్‌రెడ్డి, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
మామిడి రైతుల ఏడాది శ్రమ అడవి కాచిన వెన్నెలగా మిగిలింది. కర్షకులు మామిడిని కంటికి రెప్పలా కాపాడి, దిగుబడి సాధించినా ఆశించిన ధరలు లేకపోగా.. జిల్లా ఉన్నతాధికారులు చెప్పిన మాటలు అమలుకు నోచుకోక.. ఫ్యాక్టరీ యాజమాన్యాల దోపిడీతో ఆశించిన ధరల్లేక విలవిల్లాడిపోయాడు. ఏ వస్తువుకై నా ధర నిర్ణయించే అధికారం ఉత్పత్తిదారుడికే ఉంది. అయితే ఆ పరిస్థితి రైతులకు లేదు. దీంతో పుడమిపుత్రులు దగా పడ్డారు. ఫలరాజైన మామిడికి ఫ్యాక్టరీ యాజమాన్యాలు తక్కువ ధర నిర్ణయించి, రైతులను దోపిడీ చేశాయి.

పోలీసు కుటుంబానికి రూ.కోటి బీమా