సీపీఎస్‌ రద్దు చేయాలని నిరసన

ZP High School Techers Protest Against CPS In Mahabubanagar - Sakshi

సాక్షి, జడ్చర్ల: మండలంలోని గొల్లపల్లి జెడ్పీ హైస్కూల్‌ ఉపాధ్యాయ బృందం సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పెన్షన్‌ విద్రోహదినంగా వారు పాటిస్తూ నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలకృష్ణ, చంద్రమోహన్, ఘమలమ్మ, సంధ్య, అరుణ, కమల్‌రాజ, శ్రీనివాసులు పాల్గొన్నారు. 

బాలానగర్‌: సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్నే అమలు చేయాలని సర్వీస్‌ అసోసియేషన్‌ తెలంగాణ ఉద్యోగుల ఐక్యవేదిక, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల ఐక్యవేదిక సభ్యులు మాన్యం, శివారెడ్డి, బాలయ్య డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం వారు తహసీల్దార్‌ రవీంద్రనాథ్‌కు వినతిపత్రం అందజేశారు. పీఆర్సీ, బదిలీ, పదోన్నతుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరారు. 2004 సెప్టంబర్‌ 1 నుంచి  ఉద్యోగంలో చేరినవారికి పాత పెన్షన్‌ విధానం వర్తించకుండా ప్రభుత్వాలు జీవోలు జారీ చేయడం  నిరంకుశత్వమే అన్నారు.   మిడ్జిల్‌: సీపీఎస్‌ విధానంను వ్యతిరేకిస్తూ అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మంగళవారం మండల కేంద్రంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌ శ్రీనివాసులుకు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో  నర్సింహులు, వెంకటయ్య, రాజేంద్రప్రసాద్, రమేష్‌గౌడ్, లక్ష్మయ్య, గురుప్రసాద్, వసంత్‌నాయక్‌ తదితరులు ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top