తెలంగాణ వ్యాప్తంగా మహానేతకు ఘన నివాళులు | YS Rajasekhara Reddy Eleventh Death Anniversary In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ వ్యాప్తంగా మహానేతకు ఘన నివాళులు

Sep 2 2020 1:17 PM | Updated on Sep 2 2020 1:56 PM

YS Rajasekhara Reddy Eleventh Death Anniversary In Telangana - Sakshi

వైఎస్‌ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం తెలంగాణ వ్యాప్తంగా ఆయనకు పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు.

సాక్షి, హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం తెలంగాణ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కాంగ్రెస్‌ నేతలు, ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు. నగరంలోని పంజాగుట్ట సర్కిల్‌లో డాక్టర్‌ వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాన్నివైఎస్సార్‌సీపీ నేతలు నిర్వహించారు. తెలంగాణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి వైఎస్సార్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రపుల్‌రెడ్డి, అమృతాసాగర్‌ పాల్గొన్నారు.

హైదరాబాద్‌: పంజాగుట్ట సర్కిల్‌లో డాక్టర్‌ వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మల్లురవి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, ఫిరోజ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌ సేవలు చిరస్మరణీయని కొనియాడారు. 

సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి కాంగ్రెస్పార్టీ శాసనసభ పక్షనేత మల్లు భట్టి విక్రమార్క పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్‌, అభిమానులు పాల్గొన్నారు.

కరీంనగర్: మహానేత స్వర్గీయ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ కార్యాలయంలో వైఎస్సార్ చిత్ర పటానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు పాల్గొన్నారు.

జగిత్యాల: మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు వైఎస్సార్ అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కరీంనగర్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డితో పాటు పార్టీ నాయకులు పూల మాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ చౌక్‌లో వైఎస్సార్ చిత్ర పటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పూల మాల వేసి నివాళులర్పించారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన స్వగృహంలో వైఎస్సార్‌ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైస్సార్ సేవలను కొనియాడారు. మహానేత వైఎస్సార్‌ మన నుంచి దూరమై పదకొండు సంవత్సరాలు అవుతోందని, ఆయన చేసిన మేలు ప్రజలు మరవలేక పోతున్నారని తెలిపారు. మరువలేని మరపురాని మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో ఉన్నారని, అలాంటి నాయకుడిని మళ్లీ చూడలేమని తెలిపారు. వైఎస్సార్‌ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి కార్యకర్త పని చేయాలని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద స్వర్గీయ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి డీసీసీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. జిల్లాలోని మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి మంథని కాంగ్రెస్పార్టీ నాయకులు పూల మాల వేసి నివాళులర్పించారు. 

గద్వాల: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా గద్వాలలోని వైఎస్సార్‌ విగ్రహానికి డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

వనపర్తి: జిల్లాలోని వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో వైఎస్సార్‌ విగ్రహానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. 

నారాయణపేట: మక్తల్ మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పార్టీ నాయకులు పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్‌: కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఘనంగా దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాల వద్ద అభిమానులు నివాళులు అర్పించారు. కొల్లాపూర్‌లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వైఎస్సార్‌సీపీ నాయకులు రామకృష్ణ, వెంకట్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు. ఎంపీడీఓ కార్యాలయంలో వైఎస్సార్‌ విగ్రహానికి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రాము యాదవ్ పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ టౌన్ ప్రెసిడెంట్ కొండూరు ప్రమోద్ పాల్గొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ, బూర్గంపాడు మండలంలోని సారపాకలో మాజీ ముఖ్యమంత్రి డా.వైఎస్సార్‌ 11వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జిల్లా వైఎస్సార్‌సీపీ పార్టీ అధ్యక్షుడు కొల్లు వెంకటరెడ్డి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

ఖమ్మం: దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా సత్తుపల్లి పట్టణంలోని వైఎస్సార్‌ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పూల మాల వేసి నివాళులర్పించారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా మధిరలో ఆయన విగ్రహానికి వైఎస్సార్‌సీపీ నాయకులు ఉమా మహేశ్వర్రెడ్డి, అజాద్, ధర్మయ్య, మస్తాన్ పాషా పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement