World Tribal Day: ఆధునిక సమాజంలో అడవితల్లి బిడ్డలు

World Tribal Day: Adivasis Preserving Their Culture, Passing It On To future Generations - Sakshi

ఆధునిక సమాజంలోనూ సంప్రదాయాలకు పెద్దపీట

సంస్కృతిని కాపాడుకునేందుకు కృషి

ఆకట్టుకునే గుస్సాడీ వేషధారణ ∙దండారీ ఉత్సవాలతో గుర్తింపు

‘రేలపూలరాగం’ పేరుతో ప్రపంచానికి పరిచయం

నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

కష్టం ఎంతైనా తరగని చిరునవ్వు.. తరాలు మారినా మారని సంస్కృతి ఆదివాసీలకే సొంతం. అడవితల్లిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాలు నేటికీ అద్దం పడుతున్నాయి. ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రస్తుత ఆధునిక సమాజంలోనూ వారి సంస్కృతిని కాపాడుకుంటూ తరువాత తరాలకు అందిస్తున్నారు. గుస్సాడీ ఉత్సవాలతో గ్రామాల మధ్య ఐక్యతను చాటుతూ దండోరా సంబరాలతో ఆకట్టుకుంటున్నారు. గుస్సాడి వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వారి ఆహార అలవాట్లు వారి ఆరోగ్యానికి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారి అలవాట్లు, వేషభాషలపై ప్రత్యేక కథనం...

సంప్రదాయానికి ప్రతీక వాయిద్యాలు
నార్నర్‌(ఆసిఫాబాద్‌): ఆదివాసీ గిరిజనులు అనా దిగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఆచారాలు నేటికీ పాటిస్తున్నారు. ప్రస్తుతకాలంలో డీజేలు, వివిధ రకాల సౌండ్‌ సిస్టమ్స్‌ ఉన్నప్పటికీ వి వాహాలు, ఇతర కార్యక్రమాల్లో సంప్రదాయ వాయిద్యాలను ఉపయోగిస్తున్నారు. తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర కన్వీనర్, గుంజాల గోండిలిపి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమల్‌రావు ఆదివాసీ తెగలకు సంబంధింన 40 రకాల వాయిద్యాలు సేకరిం 2019 వర్చి 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో ఆదివాసీల ‘రేలపూల రాగం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమం ద్వారా సంగీత ప్రపంచానికి పరిచయం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాకృతిక జానపదం వినిపించడం లేదు. కళాకారులు బతికితే సంగీతం బతుకుతుందనే ఉద్దేశంతో ఆదివాసీలు నేటి యువతరానికి పరిచయం చేస్తున్నారు.


ఆదివాసీ వాయిద్యాలు :
డోల్‌ (డోలు) : డోలు, డ ప్పులను ఆదివాసీలు దైవ కార్యక్రమంతో పాటు ఇత ర శుభకార్యాల్లో వాయిస్తారు. గ్రామపెద్ద లేదా సమాజంలో గుర్తింపు పొందిన ఆదివాసీ వ్యక్తి మరణిస్తే అతని దహన సంస్కారాల్లో వాయిస్తారు. ఒ క్కో కార్యానికి ఒక్కోతీరు (బాజా) ఉంటుంది. పెళ్లిలో 10 రకాల డోలు వాయిస్తారు. అవసరాన్ని బట్టి డోల్యల్, చెడ్యంగల్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఆయా రకాల్లో వాయిస్తారు.

డప్‌ (డప్పు) : దండారీ, దేవి ఉత్సహాల్లో డప్పులు వాడుతారు. ఇది కూడా పలు రకాలుగా ఉంటుంది. బాజాల తీరు, కార్యాన్ని బ ట్టి వాయిస్తారు. ఆదివాసీల సంస్కృతిలో భాగంగా వారి ఆచారం ప్రకారం వాయిస్తూ నృత్యం చేస్తారు.

పెప్రే(సన్నాయి) : పెప్రేలను ప్రధాన్, తోటిలు వాయిస్తారు. డోలు, డప్పులకు తోడు పెప్రే అవసరం ఉంటుంది. సన్నాయి లేకపోతే ఏ ఉత్సవమైనా ఘనంగా జరగదు. ఈ రెండు ఉంటేనే ఉత్సవంలో జోస్‌ వస్తుంది. 

కాలికోం(కొమ్ము) : పెప్రేతో పాటు కాలికోం ఉంటుంది. వీటిని ప్రధాన్‌లు వాడతారు. దీనిని ఉత్సవం ప్రారంభంలో లేదా ఏదైనా కార్యక్రమం ప్రారంభంలో అప్పుడప్పుడు ఊదుతూ ఉంటారు. 

తుడుం : డోలు, డప్‌లలో తుడుం ఉంటుంది. తుడుంను కేవలం దైవ, పూజా కార్యక్రమంలో మాత్రమే ఉపయోగిస్తారు. దేవుళ్లకు సంబంధించిన కార్యంతో పాటు అతిథుల స్వాగతానికి వత్రమే దీనిని వాడతారు. 

కిక్రీ : ఇది తోటి, ప్రధాన్‌లలో ఉంటుంది. పెర్సాపెన్, పెద్ద దేవుల పురణ కథలను కిక్రీ సమేతంగా పాడి వినిపిస్తారు. 

డోల్‌కి : ఇది ఆదివాసీలు వివాహ సమయంలో గుడికి వెళ్లేటప్పుడు ఉపయోగిస్తారు. పెళ్లి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత రాత్రి డెంసా కార్యక్రమంలో దీనిని వాడతారు.

ఆకట్టుకునే సంస్కృతి,సంప్రదాయాలు..
దండేపల్లి(మంర్యాల): ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. ఏటా దసరా తర్వాత ఆశ్వీయుజ పౌర్ణమితో దండారీ ఉత్సవాలు ప్రారంభిం దీపావళి అమావాస్యతో ముగిస్తారు. ఈ సమయంలో గుస్సాడీ వేషధారణ చేసి ఒక గ్రామం వారు మరో గ్రామానికి వెళ్తారు. దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి ఒడ్డున గల పద్మల్‌పురి కాకో ఆలయంలో నిర్వహించే వేడుకలకు ఆదివాసీలు అధికసంఖ్యలో తరలివస్తారు. ఆదివాసీల ఆరాధ్య దేవతలకు బియ్యంతో పాయసం, పప్పుతో రుబ్బిన గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు. దండారీ, పెర్సాపెన్‌ ఉత్సవాల సమయంలో ఆదివాసీలు గోదారమ్మకు శాంతి పూజలు నిర్వహిస్తారు.

ఇప్పపరక నూనెకు ప్రాధాన్యం
ఇంద్రవెల్లి(ఖానాపూర్‌): ఆదివాసీలు సంస్కృతి, సంప్రదాయాలను నేటికీ కొనసాగిస్తున్నారు. సహజవనరులైన భమి, నీరు, అడవిలో దొరికే ఫలా లపై ఆధారపడి ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు. చెట్టు, పుట్ట, నీరు వంటివాటికి పూజలు చేస్త వాటితో అవినాభావ సంబంధం ఏర్పర్చుకున్నారు. ఆదివాసీలు ఆషాఢవసంలో నిర్వహించే తొలి పండుగ అకాడి(వన)దేవతలకు పూజలు. సాగు పూజలు, శుభకార్యాలు, పెర్పపేన్, తదితర పూజలకు ఇప్పపరకనూనెకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అడవిలో సేకరించిన ఇప్ప పరకలతో తీసిన నూనెతో నైవేద్యం తయారుచేసి దేవతలకు సమర్పించడంతో పాటు దీపారాధనకు వినియోగిస్తారు. ఆదివాసీ గ్రామాల్లో టేకు మొద్దులతో తయారు చేసిన గాన దర్శనమిస్తుంది. ఈనెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించేందుకు ఆదివాసీలు సిద్ధమవుతున్నారు.

మారని బతుకులు
ఉట్నూర్‌(ఖానాపూర్‌): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 4లక్షల 95వేల 794 మంది అదివాసీ గిరిజనులున్నారు. వీరందరి అభివృద్ధికి బాటలు వేసేందుకు 1975లో ప్రభుత్వం ఉట్నూర్‌ కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీల అభివృద్ధికి బాటలు వేసేందుకు ఏర్పాటైన ఐటీడీఏ నాలుగు దశాబ్దాలు దాటినా వారి జీవన విధానంలో ఎలాంటి మార్పులను తీసుకురాలేదు. నేటికి చాలా అదివాసీ గిరిజన ప్రాంతాలు కనీస మౌలిక వసతులు, సౌకర్యాలు లేక అల్లాడుతున్నాయి. విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యం అందని ద్రాక్షగానే మిగిలింది. ఏటా జ్వరాలు, వ్యాధులతో వందల సంఖ్యలో మృత్యుఒడి చేరుతున్నారు.

పండుగల్లో ప్రత్యేక ఆకర్షణగా..
జన్నారం(ఖానాపూర్‌): అడవితల్లిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీ గిరిజనుల సంప్రదాĶæలు నేటికీ అద్దం పడుతున్నాయి. జన్నారం మండలంలోని లోతొర్రే, అలీనగర్, కొలాంగూడ, హాస్టల్‌ తండా, నర్సింగాపూర్, తదితర ఆదివాసీ గ్రావల్లో అన్ని పండుగలను సంప్రదాయ బద్ధంగా జరుపుకుంటారు. దండోరా సంబరాల్లో గుస్సాడి వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 

మా సంప్రదాయం మారదు
మేమంతా ఒకేతాటిపై ఉంటాం. మా తండ్రులు, తాతలు నేర్పిన సంప్రదాయాలు వర్చుకోం.  సంప్రదాయం ప్రకారం నడుచుకుంటే మా దేవుళ్లు మమ్మల్ని కాపాడుతారు. గూడెంలో చదువుకున్నోళ్లు ఉన్నా మేము చెప్పిన విధంగానే నడుచుకుంటారు.
 – గంగరాం, లోతొర్రే గూడెం పటేల్‌

లక్ష్యం సాధించాలి...
ఆదిలాబాద్‌రూరల్‌: నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఎంతగానో శ్రమించాలి. ఇబ్బందులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించా. ఆదివాసీ తెగలో ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే స్పందించి చికిత్స అందిస్తున్నా. క్రీడల్లో రాణించే వారికి సైతం ఆర్థికంగా చేయూత అందజేస్తున్నా.
– డాక్టర్‌ సుమలత, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, రిమ్స్, ఆదిలాబాద్‌ 

దుకాణం నడుపుతూ చదివా
ఆదిలాబాద్‌రరల్‌: వది బేల మండలంలోని దహేగాం. చదువుకునే రోజుల్లో సాంగిడిలో చిన్న కిరాణా షాపు నడిపించా. మా నాన్నకు పోలీస్‌ ఉద్యోగం అంటే ఇష్టం లేదు. సర్పంచ్‌ చెప్పడంతో ఒప్పుకున్నారు. ఆ రోజుల్లో మాగ్రామానికి న్యూస్‌పేపర్‌ వచ్చేది కాదు. కిరాణా సామాను కోసం ఆదిలాబాద్‌కు వచ్చినప్పుడు పేపర్‌ చదివేవాడిని. 1985లో పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. దరఖాస్తు చేసుకుని ఎస్సైగా ఉద్యోగం సాధించాను. సీఐ, డీఎస్పీ, ఏఎస్పీ, డెప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ స్థాయికి ఎదిగా. 
– డీజీపీకి పుష్పగుచ్ఛం అందిస్తున్న మడావి బాపురావ్,డెప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్, సిద్దిపేట్‌ 

తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే..
ఆదిలాబాద్‌రరల్‌: ఆ రోజుల్లో ఏజన్సీ ప్రాంతాల్లో చదువుకునేందుకు అవకాశాలు లేవు. సౌకర్యాలు అంతంత వత్రమే. మా తల్లిదండ్రులు టీచర్లు కావడంతో ఉన్నత చదువులు చదివించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వారి లక్ష్యానికి అనుగుణంగా కష్టపడి చదివి ఉద్యోగం సాధించా. కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యం సాధించవచ్చు. తల్లిదండ్రులు వారి పిల్లల ను ప్రోత్సహించాలి.
- కుడ్మేత మనోహర్, ఏజెన్సీ డీఎంహెచ్‌వో, ఉట్నూర్‌ 

పట్టుదలతో ఉద్యోగం సాధించా
ఆదిలాబాద్‌రూరల్‌: నేను ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే రోజుల్లో అంతగా పోటీ ఉండేది కాదు. ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో చదివా. ఏకకాలంలో ఆర్టీసీలో, మెడికల్‌ ఫీల్డ్‌లో ఉద్యోగాలు వచ్చాయి. అందులో మెడికల్‌ ఫీల్డ్‌ ఎంచుకున్నా. ఉద్యోగం సాధించాలంటే తప్పనిసరిగా కష్టపడాలి. ఉన్నత స్థాయిలో రాణించిన వారు పేదవారికి సహాయం చేస్తే వారు కూడా ఉద్యోగం సాధించే ఆస్కారం ఉంటుంది. 
– సిడాం వామన్‌రావు, డెప్యూటీ పారామెడికల్‌ ఆఫీసర్, ఆదిలాబాద్‌ 

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా..
బేల(ఆదిలాబాద్‌): మండలంలోని సోన్‌కాస్‌లో నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన మేస్రం జనార్దన్, శాంతబాయి దంపతుల కుమారుడు మేస్రం నాగేశ్వర్‌ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదువు పూర్తి చేశాడు. 2013 ఫిబ్రవరిలో ఉస్మానియా యూనివర్సిటీలో జంతుశాస్త్రం విభాగంలో చేరి 2018 జూన్‌లో పట్టా సాధించాడు. సోడియం ఫ్లోరైడ్‌ అనే టాక్సికేట్‌ను ఎలుకలకు ఇచ్చి ప్లురోసిస్‌ అనే వ్యాధిని గుర్తించాడు. వ్యాధిని నయం చేసేందుకు అల్లనేరేడు, జామ, ఉసిరి, అడవిబెండ వంటి ఫలాల నుంచి క్యూరే్సటిన్‌ అనే ఔషధాన్ని తయారు చేశాడు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ జంతుశాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందాడు. ప్రస్తుతం కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఉస్మానియా యూనివర్సిటీ, కాలేజ్‌ ఫర్‌ ఉమెన్స్, కోఠిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.              

ఆదర్శంగా నాగోరావు
తాంసి: భీంపూర్‌ మండలంలోని నిపాని గ్రామానికి చెందిన మేస్రం నాగోరావు ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగం సాధించి ఆరేళ్లుగా  విధులు నిర్వహిస్త తమ ప్రాంతంలోని గిరిజనులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నిపాని గ్రామంలోని గిరిజన కుటుంబం చెందిన  మేస్రం భంబాయి, దేవరావ్‌ల కుమారుడు మేస్రం నాగోరావు. మొదటి ప్రయత్నంలోనే ఎఫ్‌సీఐలో ఉద్యోగం సాధించి 2016లో విధులలో చేరాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top