దండెత్తిన డ్వాక్రా మహిళలు | Sakshi
Sakshi News home page

దండెత్తిన డ్వాక్రా మహిళలు

Published Sat, Feb 4 2023 2:19 AM

Women Conducts Rally Over Dwakra Loans In Presence Of BJP - Sakshi

కామారెడ్డి టౌన్‌ : స్త్రీ నిధి, అభయహస్తం, వడ్డీలేని రుణాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ డ్వాక్రా మహిళా సంఘాలకు చెందిన 7 వేల మంది మహిళా సభ్యులు శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. గాంధీ గంజ్‌ నుంచి ర్యాలీ ప్రారంభమై సిరిసిల్ల రోడ్, స్టేషన్‌రోడ్, రైల్వే బ్రిడ్జి మీదుగా నిజాంసాగర్‌ చౌరస్తాకు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు.

కార్యక్రమంలో బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్‌చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు రావలసిన రూ.6 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం త్వరలోనే చెల్లించాలన్నారు. రెండ్రోజుల్లో బకాయిలు చెల్లించకుంటే ఈనెల 6 నుంచి మూడు రోజుల పాటు నిరాహారదీక్షకు దిగుతామని స్పష్టం చేశారు. అప్పటికీ స్పందించకుంటే 10 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement