ఇంట్లో వీల్‌చైర్‌.. రోడ్డుపై స్కూటర్‌!

Wheelchair Cum Scooter Spotted At Adilabad District - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డ్‌కు చెందిన చంద్రకాంత్‌ 2018లో అనారోగ్య సమస్య రావడంతో నడవలేని స్థితిలో ఉన్నారు. తనకు వచ్చిన కొత్త ఆలోచనలతో పరిగెడుతున్నారు. చెన్నైలోని ఐఐటీ స్టాండప్‌ కంపెనీ వారు తయారుచేసిన వీల్‌ చైర్‌ కం స్కూటీ రూ.95 వేల ఖర్చుతో ప్రత్యేకంగా కొనుగోలు చేసి తెప్పించుకున్నారు.

ఈ వాహనం ఇంట్లో వీల్‌ చైర్‌ లాగా.. బయటకు వెళ్తే స్కూటీ లాగా ఉపయోగించుకోవచ్చు. 4 గంటలు చార్జింగ్‌ పెడితే 30 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని చంద్రకాంత్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top