
సాక్షి, హైదరాబాద్: నగరానికి తాగునీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ (కేడీడబ్ల్యూఎస్పీ) ఫేజ్– 3 కోదండాపూర్ నుంచి గొడకొండ్ల వరకు పంపింగ్ మెయిన్–1కి సంబంధించి 2,375 ఎంఎం డయా పైపులైన్‌పై భారీ లీకేజీ ఏర్పడింది. దీంతో ఎయిర్ వాల్‌్వ, గేట్ వాల్వ్ మార్పు తదితర మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పలు రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లో సొమవారం ఉదయం 6 నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు.. సుమారు 36 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి వర్గాలు పేర్కొన్నాయి.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలివే..
గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్. ప్రశాసన్ నగర్, ఫిల్మ్‌నగర్, జూబ్లీ హిల్స్, తట్టిఖానా, భోజగుట్ట, షేక్‌పేట్, హకీంపేట్, కార్వాన్, మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, గోల్కొండ, లంగర్ హౌస్, దుర్గా నగర్, బుద్వేల్, సులేమాన్ నగర్, గోల్డెన్ హైట్స్, 9 నంబర్, కిస్మత్‌పూర్, గంధంగూడ, బండ్లగూడ, శా్రస్తిపురం, అల్లబండ, మధుబన్ కాలనీల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. అలాగే.. ధర్మసాయి (శంషాబాద్), సాహేబ్‌నగర్, ఆటోనగర్, సరూర్‌నగర్, వాసవీనగర్, నాగోల్, ఎనీ్టఆర్ నగర్, వనస్థలిపురం, దేవేందర్ నగర్, ఉప్పల్, స్నేహపురి కాలనీ, భారతనగర్, రాంపల్లి, బోడుప్పల్, చెంగిచర్ల, మానిక్ చంద్, మల్లికార్జున నగర్, పీర్జాదిగూడ, పెద్దఅంబర్‌పేట్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని జలమండలి పేర్కొంది. వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించింది.