కోడి, గుర్రపు పందేలు తెలుసు కానీ.. పందుల పోటీలు గురించి విన్నారా

Viral: Pigs fight Competition in Mahabubnagar District - Sakshi

పందుల కుస్తీ.. ఎంతో మస్తీ..

సాక్షి, మహబూబ్‌నగర్‌: మనకు కోడి పందేలు, ఎడ్లబండ్ల పోటీల గురించి తెలుసు. కానీ.. పందుల పోటీల గురించి ఎప్పుడైనా విన్నారా? చూశారా? అయితే ఇదిగో చూడండి మరి. నారాయణపేట జిల్లా మక్తల్‌ పరిధిలోని కాట్రపల్లి రోడ్డు పక్కన ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం పందుల పోటీలు నిర్వహించారు. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌ నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అనంతపురం, కర్ణాటకలోని రాయచూర్‌ తదితర ప్రాంతాల నుంచి పలువురు వరాహాలతో వచ్చి పోటీల్లో పాల్గొన్నారు.

రెండేసి వరాహాల మధ్య పోటీ నిర్వహించి గెలుపొందిన వరాహం యజమానికి నిర్వాహకులు రూ.లక్ష అందజేసినట్లు సమాచారం. పోటీల్లో పాల్గొన్న ఒక్కో పంది విలువ రూ.15 వేలనుంచి రూ.45 వేల ఉంటుం దని అంచనా. ఈ పోటీలను చూసేందుకు మక్తల్‌ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. కోడి పందేలపై ఆంక్షలు ఉండడంతో రెండు, మూడేళ్లుగా పందుల పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో గద్వాల జిల్లా అయిజలో తిక్కవీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో 1960 నుంచి ఏటా పందుల పోటీలు నిర్వహించడం అనవాయితీగా వస్తోంది.  
చదవండి: హాస్టల్‌ నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలు.. ఒకరి ఆచూకీ లభ్యం 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top