బోనాల ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు | Ujjain Mahankali Bonala Festival Begins | Sakshi
Sakshi News home page

బోనాల ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

Jun 30 2025 7:58 AM | Updated on Jun 30 2025 7:58 AM

Ujjain Mahankali Bonala Festival Begins

మంత్రి పొన్నం ప్రభాకర్‌ 

ఘనంగా ఉజ్జయినీ మహాకాళి ఘటం ఎదుర్కోలు  

బన్సీలాల్‌పేట్‌: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అమ్మవారి బోనాల వేడుకలను నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి దేవాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన అమ్మవారి ఘటం ఎదుర్కోలు కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్, ఫి షరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌తో కలిసి మంత్రి పాల్గొన్నారు. 

అమ్మవారి ఘటం తయారీ వస్తువులు, ఆభరణాలను ఫౌండర్‌ ట్రస్టీ ఫ్యామిలీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోనాల వేడుకల సందర్భంగా ఆ లయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేవా దాయ, పోలీసు, జీహెచ్‌ఎంసీ, విద్యుత్తు, సాంస్కృతిక, రవాణా, వైద్య ఆరోగ్య విభాగాలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు. మంత్రి వెంట దేవాదాయ శాఖ కమిష నర్‌ వెంకట్రావు, ఈవో మనోహర్‌ రెడ్డి ఉన్నారు.

డప్పుల దరువులకు స్టెప్పులేసిన పొన్నం..
మంత్రి పొన్నం ప్రభాకర్‌ డప్పు చప్పుళ్లకు ఆనందంతో పోతురాజుల ఈరగోళలను తీసుకొని నృత్యం చేశారు. మహాకాళి అమ్మవారి ఘటం ఎదుర్కోలు వేడుకల సందర్భంగా  ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా కనిపించాయి. అంతకు ముందు అమ్మవారి ఆలయాన్ని శ్రీ విద్యా శంకర భారతి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అమ్మవారి ఘటం ఉత్సవాల ఎదుర్కొలు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సనత్‌నగర్‌ కాంగ్రెస్‌ మహిళా నేత డాక్టర్‌ కోట నీలిమ, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చీర శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement