‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు | Ugadi Celebration Organized By Sakshi Daily Newspaper In March 19th | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Mar 18 2026 7:34 PM | Updated on Mar 18 2026 8:36 PM

Ugadi Celebration Organized By Sakshi Daily Newspaper In March 19th

సాక్షి, హైదరాబాద్‌: మూసాపేటలోని రెయిన్‌బో విస్టాస్‌ రాక్‌ గార్డెన్‌లో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు జరగనున్నాయి. గురువారం సాయంత్రం నుంచి ఈ  కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 5.55 గంటలకు జ్వోతి ప్రజ్వలనతో ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.

6 గంటలకు శృంగేరీ శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు డాక్టర్‌ బాచంపల్లి సంతోష్‌ కుమార్‌ శాస్త్రి పంచాంగ శ్రవణం చేస్తారు. అనంతరం ‘సంవత్సర పురుషోపాసన’ అనే అంశంపై ప్రముఖ తెలుగు ప్రొఫెసర్‌ డాక్టర్‌ పాతూరి నాగరాజు ప్రసంగిస్తారు. ఇంకా భజన తదితర ఇతర కార్యక్రమాలూ నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement