కొత్త వ్యాపారాల్లోకి ప్రవేశించాలి

TS: Minister Errabelli Dayakar Rao Said Enter Into Business Sectors - Sakshi

మహిళా సంఘాలకు ఎర్రబెల్లి సూచన

సాక్షి, హైదరాబాద్‌: మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీలు) పెద్ద పెద్ద వ్యాపారాలు, రంగాల్లోకి ప్రవేశించి సత్తా చాటాలని పంచాయతీరాజ్‌ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. నాణ్యతతో కూడిన కారం, పసుపు వ్యాపారాలు, కూరగాయల సాగు వంటి వాటిని మొదలుపెట్టాలన్నారు. సోమవారం రంగారెడ్డి జడ్పీ సమావేశ మందిరంలో స్త్రీనిధి రాష్ట్ర అధ్యక్షురాలు ఇందిర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్త్రీనిధి ద్వారా రాష్ట్రంలోని 619 మండల, పట్ట ణ సమాఖ్యలతో పాటు, నైబర్‌హుడ్‌ సెంట ర్లకు రూ.4.31 కోట్ల విలువైన 692 కంప్యూ టర్లు, యూపీయస్‌లు, ప్రింటర్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ సురక్ష బీమా పథకం ద్వారా ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రూ.1 లక్ష వరకు జీవిత బీమా పథకం, స్త్రీనిధి మహిళా సభ్యుల పిల్లలు ఇంటర్మీడియట్‌ చదివేందుకు స్కాలర్‌ షిప్‌లు అందజేస్తున్న ట్లు తెలిపారు.

ఈ ఏడా ది స్త్రీనిధి ద్వారా మళా స్వయం సహాయక సంఘాలకు రూ.3,060 కోట్ల మేర అందజేయనున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్త్రీ నిధి సంస్థ ద్వారా ఒక లక్ష పాడి పశువుల కొనుగోలుకు రుణ సౌకర్యం అందజేస్తున్నట్లు చెప్పారు. శ్రీనిధి విజయ డైరీ, కరీంనగర్‌ డైరీ, ముల్కనూరు మహిళా సహకార డైరీ, నార్ముల్‌ డైరీల సహకారంతో  రైతులతో సమన్వయం చేసుకొని పాడి పరిశ్రమ అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో స్త్రీనిధి సంస్థలో అందుబాటులో ఉన్న రూ.10 వేల కోట్ల డబ్బును ఎస్‌హెచ్‌జీలు సద్వినియోగం చేసుకోవాలని పీఆర్‌ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా సూచించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top