టీఎస్‌ ఐసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు | TS ICET 2022 Application Deadline Extended To July 14th | Sakshi
Sakshi News home page

టీఎస్‌ ఐసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

Jul 5 2022 1:28 AM | Updated on Jul 5 2022 2:59 PM

TS ICET 2022 Application Deadline Extended To July 14th - Sakshi

కేయూ క్యాంపస్‌: ఎంబీఏ, ఎంసీఏ కోర్సు­ల్లో ఈ విద్యాసంవత్సరం ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీని పొడి­గిం­చింది. రూ.250 అపరాధ రుసుముతో ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్‌ ఐసెట్‌ కన్వీనర్, కాకతీయ వర్సిటీ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం ప్రొఫెసర్‌ కె.రాజిరెడ్డి సోమవారం తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 15 నుంచి 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.

ఇప్పటివరకు టీఎస్‌ ఐసెట్‌కు 67,361 దరఖాస్తులు వచ్చాయని, గత ఏడాదితో పోలిస్తే 1,700 దరఖాస్తులు పెరిగినట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 18 నుంచి హాల్‌టికెట్లు సంబంధిత వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ఈనెల 27, 28 తేదీల్లో మూడు సెషన్లలో టీఎస్‌ ఐసెట్‌–2022 నిర్వహించనున్నట్లు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement