లెక్కలేనట్టు ఉంటామంటే ఊరుకోం: హైకోర్టు

TS High Court Send Contempt Notice To Public Health Officer - Sakshi

కరోనా పరీక్షలపై ఉద్దేశపూర్వకంగానే మా ఆదేశాల అమలులో నిర్లక్ష్యం

పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ.. కౌంటర్‌ దాఖలుకు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌ : రోజూ 50 వేల కరోనా పరీక్షలు, వారానికోసారి లక్ష పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే తమ ఆదేశాలను అమలు చేయలేదని, డాక్టర్‌ శ్రీనివాసరావుపై కోర్టుధిక్కరణ కింద చర్యలు తప్పవని హెచ్చరించింది. తమ ఆదేశాలపై అభ్యంతరముంటే అప్పీల్‌ చేసుకోవచ్చని, అంతేగానీ లెక్కలేనట్టు వ్యవహరిస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించింది. ఈ మేరకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశించింది.

కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని, ప్రైవేటు ఆసుపత్రుల ఫీజు దోపిడీని నియంత్రించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా విచారణకు డాక్టర్‌ శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. రోజుకు 50 వేల పరీక్షలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే ఇంకా ఎక్కువ చేసేందుకూ సిద్ధమని డాక్టర్‌ శ్రీనివాసరావు నివేదిక సమర్పించడంపై ధర్మాసనం మండిపడింది. రోజుకు 50 వేల పరీక్షలు తప్పకుండా చేయాలని ఈనెల 19న తాము ఆదేశించినా ఎందుకు చేయలేదని ప్రశ్నించింది. ఈ వారంలో రోజుకు 40 నుంచి 42 వేలలోపు మాత్రమే పరీక్షలు చేశారని, కోర్టు ఆదేశాల అమలులో అధికారులు  బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని మండిపడింది.

ఏపీలో ప్రతి మిలియన్‌కు 1.85 లక్షల పరీక్షలు 
‘ఏపీలో ప్రతి పది లక్షల (మిలియన్‌) జనాభాకు 1,85,025 మందికి పరీక్షలు చేశారు. ఢిల్లీలో 2.95 లక్షలు, కేరళలో 1.67 లక్షల పరీక్షలు చేయగా, తెలంగాణలో 1.39 లక్షల పరీక్షలే చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ పరీక్షల సంఖ్య చాలా తక్కువుంది. వెంటనే పరీక్షలు పెంచాలి. రోజూ 50 వేలకు తగ్గకుండా చేయాలి. వారంలో ఒకరోజు లక్ష పరీక్షలకు తగ్గకుండా చేయాలి. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష ల్యాబ్‌లను పెంచుతామని రెండు నెలల క్రితం హామీనిచ్చారు. ప్రస్తుతం ఉన్న 17కు అదనంగా 6 ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రెండు నెలలు గడిచినా ఒక ల్యాబ్‌ను మాత్రమే పెంచారు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, కరోనా కారణంగా కుటుంబసభ్యులను, ఉపాధిని కోల్పోయిన వారు మానసిక సంఘర్షణలో ఉంటారని, వారి కోసం మానసిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని రెండు నెలల క్రితం ఆదేశించినా ఇప్పటికీ అమలు చేయలేదని పేర్కొంది. తదుపరి విచారణను డిసెంబర్‌ 17కు వాయిదా వేసింది.

‘యశోద’పై ఎందుకంత ప్రేమ?  
‘సన్‌షైన్‌ ఆసుపత్రిపై 14, కేర్‌పై 10, మెడీకవర్‌పై 8, కిమ్స్‌పై 13, విరించి ఆసుపత్రిపై 19 ఫిర్యాదులు వచ్చాయి. సోమాజిగూడ, సికింద్రాబాద్‌ల్లోని యశోద ఆసుపత్రులపై ఎక్కువ బిల్లులు వసూలు చేశారంటూ అత్యధికంగా 33 ఫిర్యాదులొచ్చాయి. యశోదపై ఇన్ని ఫిర్యాదులొచ్చినా చర్యలెందుకు తీసుకోలేదు?. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేశాయంటూ డెక్కన్, విరించి ఆసుప్రతులపై మాత్రమే ఎందుకు చర్యలు తీసుకున్నారు?. యశోద ఆసుపత్రి అంటే ఎందుకంత ప్రేమ?’అని శ్రీనివాసరావును ధర్మాసనం ప్రశ్నించింది. ప్రైవేటు ఆసుపత్రులపై 276 ఫిర్యాదులు రాగా 154 పరిష్కరించామని, 122 పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారని, తదుపరి విచారణలోగా పెండింగ్‌లో ఉన్న 122 ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారో స్పష్టంగా నివేదికనివ్వాలని ఆదేశించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

14-01-2021
Jan 14, 2021, 05:35 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మంగళవారం 38,192 మంది నమూనాలను పరీక్షించగా, అందులో 331 మందికి...
14-01-2021
Jan 14, 2021, 04:45 IST
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌కు కేంద్ర ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. టీకా సరఫరా కోసం ఉద్దేశించిన కో–విన్‌ యాప్‌లో ఇప్పటికే...
14-01-2021
Jan 14, 2021, 01:48 IST
భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కోవాగ్జిన్‌ టీకా వేసుకునే లబ్ధిదారులు తప్పనిసరిగా అంగీకారపత్రం ఇవ్వాల్సి ఉంటుందని ..
13-01-2021
Jan 13, 2021, 17:43 IST
నిరాధారమైన ఆరోపణలు చేయడం విచారకరమని సోమ్‌ పేర్కొన్నారు.
13-01-2021
Jan 13, 2021, 14:42 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌  కేజ్రీవాల్‌   తనరాష్ట్రప్రజలకు తీపి కబురుఅందించారు. కేంద్రం ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌ ను ఉచితంగా ...
13-01-2021
Jan 13, 2021, 05:08 IST
న్యూఢిల్లీ/పుణే: ఈనెల 16వ తేదీన జరిగే దేశవ్యాప్త కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చకచకా జరిగి పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సోమవారం...
13-01-2021
Jan 13, 2021, 03:23 IST
సాక్షి, అమరావతి/గన్నవరం: రాష్ట్రానికి కోవిడ్‌ టీకా వచ్చేసింది. గన్నవరం విమానాశ్రయానికి కోవిడ్‌ టీకా బాక్సులు చేరుకున్నాయి. సీరం ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించిన...
12-01-2021
Jan 12, 2021, 16:44 IST
ప్రభుత్వ మెగా టీకా డ్రైవ్‌లో అందించే కోవిషైల్డ్ వ్యాక్సిన్ ధరపై స్పందించిన అదర్‌ పూనావాలా మొదటి 100 మిలియన్ మోతాదులకు మాత్రమే  200 రూపాయల ప్రత్యేక ధరకు అందించామన్నారు. ...
12-01-2021
Jan 12, 2021, 09:51 IST
ముంబై: ఏడాది పాటుగా కరోనా వైరస్‌తో కకావికాలమైన దేశం మరి కొద్ది రోజుల్లో ఊపిరి పీల్చుకోనుంది. వైరస్‌ని ఎదుర్కొనే కోవిడ్‌...
12-01-2021
Jan 12, 2021, 09:50 IST
ప్రాణాంతక కరోనా మహమ్మారి చైనాలోనే పుట్టిందని ప్రపంచవ్యాప్తంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
12-01-2021
Jan 12, 2021, 05:44 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ను అన్ని పీహెచ్‌సీల పరిధిలో ప్రారంభించడానికి అవసరమైన...
12-01-2021
Jan 12, 2021, 05:39 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాక్సిన్లు ఏమాత్రం పక్కదారి పట్టకుండా ఉండేందుకు, బ్లాక్‌ మార్కెట్లకు తరలకుండా ఉండటానికి గట్టి నిఘా పెట్టాలని...
12-01-2021
Jan 12, 2021, 04:46 IST
న్యూఢిల్లీ: కేంద్ర వార్షిక బడ్జెట్‌ ప్రతులను పార్లమెంట్‌ సభ్యులకు ఈసారి డిజిటల్‌ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్‌–19 ప్రొటోకాల్‌...
12-01-2021
Jan 12, 2021, 04:25 IST
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ దిశగా కీలక పరిణామం...
12-01-2021
Jan 12, 2021, 04:18 IST
న్యూఢిల్లీ: కరోనా టీకాను తొలిదశలో 3 కోట్ల మందికిపైగా ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు అందజేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర...
11-01-2021
Jan 11, 2021, 17:31 IST
సాక్షి, న్యూఢిల్లీ: జనవరి 16వ తేదీనుంచి కరోనా వైరస్‌ మహమ్మారికి అంతానికి దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ షురూ కానున్న నేపథ్యంలో కేంద్రం...
11-01-2021
Jan 11, 2021, 12:17 IST
కరోనా వైరస్‌ మహమ్మారి అమెరికాలో పురుషులతో పోలిస్తే  ఉపాధిని కోల్పోయిన వారిలో మహిళలే ఎక్కువ ఉన్నారు.
11-01-2021
Jan 11, 2021, 05:04 IST
లండన్‌ : బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్, ఆమె భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌కు కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ఇచ్చారు. విండ్సర్‌ కేజల్‌లో ఉంటున్న...
11-01-2021
Jan 11, 2021, 04:46 IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారు. ఈ నెల 16వ...
11-01-2021
Jan 11, 2021, 04:41 IST
న్యూఢిల్లీ: కరోనా టీకా పంపిణీలో ‘కోవిన్‌’ యాప్‌ కీలక పాత్ర పోషించనుందని కేంద్రం ఆదివారం ప్రకటించింది. వ్యాక్సిన్‌ అందరికీ, అన్ని...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top