తెలంగాణ సర్పంచ్‌ ఎలక్షన్స్‌ ప్రక్రియ ప్రారంభం, ఎన్నికలు ఎప్పుడంటే..

TS EC Begins Rural Local Bodies Elections 2024 Process - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వేళ.. మళ్లీ ఎన్నికల సందడి మొదలుకానుంది. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్యలో ఈ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. 

వచ్చే ఏడాది జనవరి 31వ తేదీతో ఇప్పుడున్న సర్పంచ్‌ల పదవీకాలం పూర్తి కానుంది. ఈ క్రమంలో.. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ప్రక్రియను ప్రారంభించింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై గ్రామ కార్యదర్శుల్ని వివరాలు అడిగి తీసుకున్నారు అధికారులు. రాబోయే వారం పదిరోజుల్లో ఈ ఎన్నికల నిర్వహణ ఎప్పుడనేదానిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top