Bullet Bandi: 'బుల్లెట్‌ బండి' పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ఎంపీ

TRS MP Maloth Kavitha Bullet Bandi Dance Video Became Viral Mahabubabad - Sakshi

మహబూబాబాద్‌: ఇటీవల సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం పొందిన ‘బుల్లెట్టు బండెక్కి’ పాటకు అందరూ ఆకర్షితులవుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ యాసలో ఎంతో మధురంగా ఉన్న ‘బుల్లెట్టు బండి’ పాటకు మంచిర్యాల జిల్లాకు చెందిన సాయిశ్రీయ తన పెళ్లి బరాత్‌లో అద్భుతంగా డ్యాన్స్‌ చేసింది.  ఆ వీడియో సోషల్‌ మీడియాను ఒక ఊపు ఊపింది.

చదవండి: Bullettu Bandi Bride: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్‌ ఆఫర్‌

తాజాగా మహబూబాబాద్ ఎంపీ మాలోత్‌ కవిత ఒక వివాహ వేడుకలో బుల్లెట్‌ బండి పాటకు ఆడిపాడారు.  మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఎంపీ కవిత.. నూతన వధూవరులతో పాటు వారి కుటుంబసభ్యులతో కలిసి డ్యాన్స్‌ చేశారు. తన డ్యాన్స్‌తో అక్కడన్న వారందరిని అలరించారు. ఎంపీ డాన్స్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top