ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద ఉద్రిక్తత

tention at khairathabad ganesh temple - Sakshi

సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో గణేషుని మండపంలోకి భక్తులను అనుమతించొద్దని పోలీసుల ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాలను అమలు చేస్తున్న కమిటీ సభ్యులు.. భక్తులను ఎవరనీ మండపంలోకి అనుమతించచోమని, రోడ్డుమీద నుంచి దర్శనం కల్పిస్తామని  ప్రకటించారు. దీనిలో భాగంగానే బయటి నుంచే రోప్‌ల వెలుపల భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కమిటీ సభ్యుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  భజరంగ్ దళ్ సభ్యులు ఆందోళన చేపట్టారు. గణేష్‌కు అడ్డంగా పరదా కట్టొద్దంటూ నిరసన చేపట్టారు. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు చేరుకుని ఆందోళన కారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడటంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top