Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

Telugu News Breaking News Evening News Roundup 13th September 2022 - Sakshi

1. వైద్యం, ఆరోగ్యం.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు
వైద్యం, ఆరోగ్య విభాగాల పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. క్యాన్సర్‌ నివారణ, చికిత్సలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. దూసుకొచ్చిన వీఆర్‌ఏలు.. తెలంగాణ ఇంటెలిజెన్స్‌ మరో ఫెయిల్యూర్‌
తెలంగాణ ఇంటెలిజెన్స్‌ మరోసారి విఫలం అయింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ వీఆర్‌ఏల ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ.. ఇంటెలిజెన్స్‌ ఛలో అసెంబ్లీని పసిగట్టలేకపోయింది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. రాజధాని అమరావతి అసైన్డ్‌ భూముల స్కామ్‌లో ఐదుగురు అరెస్ట్‌
రాజధాని అసైన్డ్‌ భూముల కుంభకోణం కేసులో ఐదుగురిని  సీఐడీ అరెస్ట్‌ చేసింది. కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయలు, కొట్టి దొరబాబులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. జిన్‌పింగ్‌ పుతిన్‌, మోదీని కలుస్తారా? నిరాకరించిన చైనా !
ఈ వారంలోనే షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎన్‌సీఓ) ప్రాంతీయ భద్రతా బ్లాక్‌ సదస్సు జరగనుంది. ఆ సదస్సుకు సంబంధించిన ప్రణాళికా విషయాలు గురించి వెళ్లడించడానికి చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరాకరించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. తూర్పు లద్దాక్‌లో బలగాలను ఉపసంహరించుకున్న భారత్‌, చైనా
భారత్-చైనా సరిహద్దు వివాదంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా కీలక ముందడుగు పడింది. తూర్పు లద్దాక్‌ పెట్రోలింగ్ పాయింట్ 15 సమీపంలోని గోగ్రా హైట్స్ హాట్ స్ప్రింగ్స్‌ ప్రాంతంలో ఇరుదేశాలు తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్నాయి. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. తగ్గేదేలే.. 20లోపు జీవో రాకపోతే ఉద్యమం ఉధృతం: వీఆర్‌ఏలు
మంత్రి కేటీఆర్‌ హామీతో ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని వీఆర్‌ఏలు అన్నారు. మంత్రిపై తమకు నమ్మకం ఉందన్నారు. ఆందోళన విరమించాలన్న కేటీఆర్‌ ప్రతిపాదనలపై చర్చిస్తున్నామని వీఆర్‌ఏ నేతలు పేర్కొన్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ‘పెళ్లి కాకపోయిన పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కంటాను’
‘సీతారామం’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన మరాఠి బ్యూటీ మృణాల్‌ ఠాకుర్‌. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌తో ఆమె ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌ జాబితాలో చెరిపోయింది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. హెచ్‌సీఎల్‌ ఉద్యోగులకు భారీ షాక్‌!
ప్రముఖ దేశీయ టెక్‌ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ ఉద్యోగులకు భారీ షాక్‌ ఇచ్చింది. హెచ్‌సీఎల్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ న్యూస్‌ విభాగానికి చెందిన ప్రొడక్ట్‌పై వర్క్‌ చేస్తోంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. యంత్రాన్ని ప్రేమించు...  మనిషిని ద్వేషించు! కోపం వస్తోందా?
వచ్చేసింది.. కృత్రిమ మేధ , మరమనుషుల ఉపయోగం , డిజిటలైజేషన్, ఆటోమేషన్ యుగం! రానున్న 15 ఏళ్ళల్లో భారీగా తగ్గిపోనున్న ఉద్యోగాలు/ వృత్తులు.. డ్రైవర్ , వ్యవసాయదారుడు , ప్రింటర్, పబ్లిషర్ , క్యాషియర్, ట్రావెల్ ఏజెంట్ , వైటర్స్ , డిస్పాచ్ క్లర్క్, ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగాలు, మిలిటరీ పైలట్, సోల్జర్
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. టి20 ప్రపంచకప్‌కు కొత్త జెర్సీతో బరిలోకి టీమిండియా..
ఆసియా కప్‌ టోర్నీలో నిరాశజనక ప్రదర్శన అనంతరం టీమిండియా మరో మెగాటోర్నీకి సిద్ధమైంది. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదిక పొట్టి ప్రపంచకప్‌ జరగనుంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top