Banjara Hills: తెలుగు మీడియం రెస్టారెంట్‌లో దారుణం! | telugu medium restaurant rotten mutton keema complaint | Sakshi
Sakshi News home page

Banjara Hills: తెలుగు మీడియం రెస్టారెంట్‌లో దారుణం!

Apr 20 2026 1:53 PM | Updated on Apr 20 2026 1:53 PM

telugu medium restaurant rotten mutton keema complaint

హైదరాబాద్:  బంజారాహిల్స్‌ ఆదివారం పూట సరదాగా హోటల్‌ నుంచి నాన్‌ వెజ్‌ ఐటమ్‌ తెప్పించుకున్న ఓ పోలీసు అధికారికి చేదు అనుభవం ఎదురైంది.  కుళ్లిపోయిన మాంసంతో తయారు చేసిన ఖీమాతో వచ్చిన పార్సల్‌ చూసి ఆ అధికారి షాక్‌ కు గురయ్యారు. వివరాలకు వెళ్తే.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 46 లో తెలుగు మీడియం పేరుతో రెస్టారెంట్‌ ఉంది. 

ఆదివారం మధ్యాహ్నం ఓ పోలీస్‌ అధికారి ఆన్లైన్‌  ద్వారా ఆర్డర్‌ చేసి ఈ హోటల్‌ నుంచి మటన్‌ కీమా తో పాటు మరికొన్ని నాన్‌ వెజ్‌ ఐటమ్‌ లు తెప్పించుకున్నాడు. పార్సల్‌ విప్పి చూడగా మటన్‌ ఖీమా కుళ్ళిపోయి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించాడు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలుగు మీడియం రెస్టారెంట్‌ కి చేరుకొని ఆహార పదార్థాలను పరిశీలించి శాంపిల్స్‌ సేకరించారు. మిగిలిపోయిన ఖీమా తదితర ఆహార పదార్థాలను స్వా«దీనం చేసుకున్నారు.  ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు ఈ శాంపిల్స్‌ అందజేయనున్నట్లు పోలీసులు తెలిపారు.     

Advertisement
 
Advertisement
Advertisement