కేంద్రం వల్లే విద్యుత్‌ సంక్షోభం

Telangana Transco Genco CMD Prabhakar Rao Comments On Central Govt - Sakshi

ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు వ్యాఖ్యలు  

సాక్షి, హైదరాబాద్‌: ‘దేశంలో ఇటీవల తలెత్తిన విద్యుత్‌ సంక్షోభానికి డిస్కంలను తప్పుబట్టలేం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలే అందుకు కారణం. విద్యుత్‌ ఉమ్మడి అంశమని మరిచిపోయిన కేంద్రం... రాష్ట్రాల సమ్మతి లేకుండానే వాటిపై ఏకపక్ష విధానాలను రుద్దుతోంది. విదేశీ బొగ్గు దిగుమతులు చేయాలని ఒత్తిడి చేస్తోంది. సింగరేణి నుంచి తెలంగాణ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లకు ఏటా 16 మిలియన్‌ టన్నుల బొగ్గు సరఫరా ఉంది.

జెన్‌కోకు సొంత (క్యాప్టివ్‌) బొగ్గు గని సైతం ఉంది. మేమెందుకు బొగ్గు దిగుమతి చేయాలి? ఆ భారం ప్రజలపై ఎందుకు వేయాలి?’ అని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్రశ్నించారు. విద్యుత్‌ చట్ట సవరణ ముసాయిదా బిల్లు, విద్యుత్‌రంగ ప్రైవేటీకరణ, బొగ్గు దిగుమతులతోపాటు ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ విధానాలకు వ్యతిరేకంగా శనివారం హైదరాబాద్‌ లో జరిగిన అఖిల భారత విద్యుత్‌ ఇంజనీర్ల సమాఖ్య కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. బొగ్గు దిగుమతుల ఖర్చుకు డిస్కంలు ప్రతి వారం విద్యుదుత్పత్తి కంపెనీలకు 15 శాతం బిల్లులు చెల్లించాలని కేంద్రం ఆదేశించడాన్ని ప్రభాకర్‌రావు తప్పబట్టారు. 

ప్రైవేటీకరణ కోసమే...
ప్రభుత్వ నియంత్రణ లో విద్యుత్‌ పంపిణీ, ధరల నిర్ణయం ఉండ కూడదన్న భావనతోనే కేంద్రం విద్యుత్‌రంగ ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తోందని ప్రభాకర్‌రా వు విమర్శించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top