డ్రగ్స్‌ కేసు విచారణను ప్రభుత్వం అడ్డుకుంటోంది.. 

Telangana: Revanth Reddy Faults Govt Attitude In Drugs Case - Sakshi

ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ను కలసి ఫిర్యాదు చేసిన రేవంత్‌రెడ్డి   

సాక్షి, హైదరాబాద్‌: సినీ సెలబ్రిటీల డ్రగ్‌ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని టీపీసీసీ అధ్యక్షుడు, రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో గుట్కా, మట్కా, పేకాట లేవని ముఖ్య మంత్రి చెప్తున్నా, అందుకు విరుద్ధంగా ఇవన్నీ ఇక్కడ జోరుగా సాగుతున్నాయని ఆరోపించారు. ఎక్సైజ్‌ శాఖ జరిపిన సినీ సెలబ్రిటీల డ్రగ్‌ కేసు విచారణలో అనేక లోపాలున్నాయని అన్నారు.

తాను ఇదివరకు వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు చేయాలని ఆదేశించిందని చెప్పారు. అయితే ఎక్సైజ్‌ విభాగం ఇప్పటివరకు ఈడీకీ కేసు పూర్వాపరాలు, ఆధారాలను ఇవ్వకపోవడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఆయన శుక్రవారం ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ను కలసి మరోసారి ఫిర్యాదు చేశారు.

రాజకీయ నేతలు ప్రమేయం ఉండటం వల్లే ప్రభుత్వం ఈడీ విచారణకు సహకరించడంలేదని ఆరోపించారు. కాగా, సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఆదర్శంగా ఉండాలని కోరిన రేవంత్‌రెడ్డి.. 12 నెలల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, డగ్స్‌ కేసులో ఎంత పెద్ద హీరో ఉన్నా వదిలేది లేదని స్పష్టం చేశారు.

చదవండి: మందు కొడితే మాకుమేమే రౌడీలం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top