ధాన్యం సేకరణలో తెలంగాణ 3 | Telangana Ranks Third In Paddy Collection In Country | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణలో తెలంగాణ 3

Published Wed, Feb 23 2022 1:23 AM | Last Updated on Wed, Feb 23 2022 8:32 AM

Telangana Ranks Third In Paddy Collection In Country - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వానాకాలం సీజన్‌ ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే మూడోస్థానంలో నిలిచింది. మద్దతు ధరతో రైతుల నుంచి 70.22 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించి తెలంగాణ ఈ ఘనత సాధించినట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 70.39 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు.

తాజా వివరాలు కేంద్రానికి అందలేదు. కాగా అత్యధికంగా ధాన్యం సేకరించిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో పంజాబ్‌ నిలవగా, రెండోస్థానంలో ఛత్తీస్‌గఢ్‌ నిలిచాయి. ఫిబ్రవరి 20 నాటికి దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను కేంద్రం వెల్లడించింది. వానాకాలం సీజన్‌లో దేశంలో 94.15 లక్షల మంది రైతులు రూ.1.36 లక్షల కోట్ల విలువైన 6.95 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని విక్రయించారు. రాష్ట్రంలో 32 జిల్లాల్లో 6,872 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం 12.86 లక్షల మంది రైతుల నుంచి 70.39 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. దీని విలువ రూ. 13,775 కోట్లు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement