World Tourism Day 2021: Minister Srinivas Goud At the Event - Sakshi
Sakshi News home page

Eco Urban Tourist Park ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్‌ ‘తెలంగాణలో..’

Sep 28 2021 8:16 AM | Updated on Sep 28 2021 10:53 AM

Telangana Minister Srinivas Goud Attend World Tourism Day Programme - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్‌ పర్యాటక రంగాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారని, ఇక్కడ ఎన్నో అద్భుత పర్యాటక ప్రదేశాలున్నాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సోమవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టూరిజంలో విశేష సేవలను అందించిన స్టేక్‌ హోల్డర్లకు టూరిజం ఎక్సలెన్స్‌ అవార్డులను మంత్రి అందించారు.
చదవండి: దొంగ తెలివి... చాక్లెట్లు కూడా బంగారమే!

అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రపంచస్థాయి గుర్తింపు లభించే పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని, సీఎం కేసీఆర్‌ కృషితో రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాను ఒక టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కాళేశ్వరం పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద కేసీఆర్‌ ఎకో అర్బన్‌ టూరిజం పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని, రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా, కార్పొరేషన్‌ ఎండీ మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: ‘డ్రోన్‌ డెలివరీ’ అద్భుతం: వరద ప్రాంతాలకు మందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement