‘చల్మెడ’లో మరో ఐదుగురికి కరోనా  | Telangana: Medical Students Test Positive For Covid-19 In Karimnagar | Sakshi
Sakshi News home page

‘చల్మెడ’లో మరో ఐదుగురికి కరోనా 

Dec 7 2021 4:20 AM | Updated on Dec 7 2021 4:20 AM

Telangana: Medical Students Test Positive For Covid-19 In Karimnagar - Sakshi

కరీంనగర్‌ రూరల్‌: కరీంనగర్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన చల్మెడ ఆనందరావు వైద్య కాలేజీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం మరో 50 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటివరకు కరోనా బారిన పడిన మొత్తం వైద్య విద్యార్థుల సంఖ్య 50కి చేరింది.

శనివారం కరోనా లక్షణాలతో ఉన్న వైద్య విద్యార్థులకు ఆదివారం పరీక్షలు నిర్వహించగా.. 45 మందికి పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జునేరియా మెడికల్‌ కాలేజీని సందర్శించి యాజమాన్యంతో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 500 మంది వైద్య విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. కరోనా బాధితులందర్నీ హోంక్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement