Telangana Health Director Srinivasa Rao Controversy Comments In Iftar Dinner, Details Inside - Sakshi
Sakshi News home page

తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

Apr 18 2023 9:33 AM | Updated on Apr 18 2023 3:36 PM

Telangana Health Director Srinivasa Rao Controversy Comments - Sakshi

తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాయత్తు మహిమతోనే ఈ స్థాయిలో ఉన్నానంటూ వ్యాఖ్యానించారు. డాక్టర్లు చేయలేని పని తాయత్తు చేసిందని డీహెచ్‌ శ్రీనివాస్‌ అన్నారు. 

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాయత్తు మహిమతోనే ఈ స్థాయిలో ఉన్నానంటూ వ్యాఖ్యానించారు. డాక్టర్లు చేయలేని పని తాయత్తు చేసిందని డీహెచ్‌ శ్రీనివాస్‌ అన్నారు. కొత్తగూడెం ఇఫ్తార్‌ విందులో తాయత్తు గురించి ప్రస్తావించారు.

కాగా, హెల్త్ డైరెక్టర్ కాంట్రవర్సీలో ఇరుక్కోవడం ఇదేం తొలిసారి కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాకు పితృ సామానులని ఆయన పాద పద్మాలు తాకడం నా అదృష్టంగా భావిస్తున్నానంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

గత ఏడాది.. కొత్తగూడెం శ్రీనగర్‌ కాలనీ డీఎస్‌ఆర్‌ క్యాంపు కార్యాలయంలో సినిమా పాటకు డ్యాన్స్‌ చేశారు. డీజే టిల్లు పాటకు బతుకమ్మ ముందు స్టెప్పులేశారు. దీనిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రంగా భావించే బతుకమ్మ సంబరాల్లో సినిమా పాటలకు స్టెప్పు లేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఇంతకముందు ఓ తండాలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొనడంతో శ్రీనివాసరావు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు ప్రచారం జరిగింది.
చదవండి: ఓయో రూమ్స్‌ మేనేజర్‌ ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement