సినిమా టికెట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం | Telangana HC raps Govt over cinema ticket hike for Ram Charan’s Peddi movie | Sakshi
Sakshi News home page

కోర్టు ఉత్తర్వులున్నా మెమో ఎందుకిస్తున్నారు?

Jun 11 2026 7:31 AM | Updated on Jun 11 2026 8:17 AM

Telangana HC raps Govt over cinema ticket hike for Ram Charan’s Peddi movie

సాక్షి, హైదరాబాద్‌: సినిమా టికెట్ల పెంపుపై తాము ఉత్తర్వులు జారీ చేసినా ఎందుకు ధరలు పెంచుతూ మెమో జారీ చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దాదాపు ఆరేడు మెమోలు జారీ చేశారని, సదరు అధికారి ఆంతర్యం ఏంటని అడిగారు. ధరలు పెంచబోమని హామీ ఇచ్చిన తర్వాత కూడా తదుపరి చిత్రాలకు అదే చర్యలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది హాజరుకాకపోవడంతో తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేసింది. 

పెద్ది సినిమాకు టికెట్ల ధరలను పెంచుతూ ఇచ్చిన మెమోను సవాల్‌ చేస్తూ డి.చంద్రబాబు హైకోర్టులో ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు ఉత్తర్వులున్నా ధిక్కరిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి మెమో జారీ చేశారన్నారు. పదేపదే కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తున్నందున సదరు అధికారికి రూ.10 లక్షల జరిమానా విధించి లీగల్‌ సర్వీస్ అథారిటీకి చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి.. విచారణ వాయిదా వేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement