ఆర్డీఎస్‌ ఆధునికీకరణ పనులు పూర్తి చేయించండి  | Telangana Government Letter To Tungabhadra Board | Sakshi
Sakshi News home page

ఆర్డీఎస్‌ ఆధునికీకరణ పనులు పూర్తి చేయించండి 

Oct 6 2021 2:50 AM | Updated on Oct 6 2021 2:50 AM

Telangana Government Letter To Tungabhadra Board - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తుంగభద్ర నదీ జలాల్లో రాష్ట్రానికి ఉన్న వాటా నీటిని వినియోగించుకునేలా ఆర్డీఎస్‌ కాల్వల ఆధునికీకరణ పనులను త్వరగా పూర్తి చేయించాలని తెలంగాణ తుంగభద్ర బోర్డును కోరింది. తుంగభద్రలో రాష్ట్రా నికి 15.90 టీఎంసీల మేర నీటి కేటాయింపులు ఉన్నప్పటికీ 5 టీఎంసీలకు మించి రావ డం లేదని దృష్టికి తెచ్చింది.

ఈ మేరకు మంగళవారం ఇరిగేషన్‌ శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ తుంగభద్ర బోర్డుకు లేఖ రాశారు. 2020–21 ఏడాదిలో ఆర్డీఎస్‌కు తుంగభద్ర నుంచి 5.15 టీఎంసీల మేర నీరు కేటా యించినా తెలంగాణకు కేవలం 1.18 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిందని తెలిపింది. ఈ దృష్ట్యా నిర్దిష్ట వాటా మేరకు నీటి వాటాలు దక్కేలా ఆధునికీకరణపనులు చేయించాలని కోరింది. మరోపక్క ఆంధ్రప్రదేశ్‌ మాత్రం అటు తుంగభద్ర నీటిని, ఇటు శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని యథేచ్చగా వినియోగిస్తోందని దృష్టికి తెచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement