తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌కు జాతీయ గుర్తింపు | Telangana Diagnostics Gets NABL Recognition | Sakshi
Sakshi News home page

తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌కు జాతీయ గుర్తింపు

Oct 30 2022 1:57 AM | Updated on Oct 30 2022 1:57 AM

Telangana Diagnostics Gets NABL Recognition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ డయాగ్నొస్టిక్‌ సేవలకు జాతీయ గుర్తింపు దక్కింది. నాణ్యమైన వైద్యమే కాకుండా బాధితులు/ రోగులకు రోగ నిర్ధారణ పరీక్షలు సై తం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నొస్టిక్‌ సేవలను ప్రారంభించింది. పరీక్షల నిర్వహణ, ఫలితాలలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నందుకు తెలంగాణ డయాగ్నొస్టిక్‌ సెంట్ర ల్‌ ల్యాబ్‌కు మెడికల్‌ టెస్టింగ్‌ విభాగంలో నేషనల్‌ అక్రిడేషన్‌ బోర్డు ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ కాల్బ్రేషన్‌ లేబొ రేటరీస్‌ (ఎన్‌ఏబీఎల్‌) సర్టిఫికేషన్‌ లభించింది.

దీనిపై ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు.  సీఎం కేసీఆర్‌ ఆలోచనతో అన్ని జిల్లాల్లో ప్రారంభమై 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాయని, పరీక్షల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement