
హైదరాబాద్: ఫెయిర్ అండ్ ఫ్రెండ్లీ ప్రొఫెషనల్ పోలీసింగ్ తన ఫిలాసఫీ అనే మరొకసారి స్పష్లం చేశారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ సిబ్బందికి లేఖరాశారాయన. ‘ ప్రజల భద్రత మన ప్రధాన బాధ్యత. పోలీస్ సిబ్బంది వెల్ఫేర్ నా వ్యక్తిగత ప్రయారిటీ. పోలీస్ స్టేషన్లలో సివిల్ వివాదాలకు తావు లేదు. సివిల్ వివాదాల కోసం సివిల్ కోర్టులున్నాయి. పోలీస్ స్టేషన్ అడ్డాగా సివిల్ పంచాయితీ చేస్తే చర్యలు తీసుకుంటాం.
యూనిఫాం, కరప్షన్ ఒకే దగ్గర ఉండవు. ఒక్కడూ లంచం తీసుకుంటే డిపార్ట్‌మెంట్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. డిపార్ట్‌మెంట్‌లో లంచం తీసుకుంటే కఠినంగా ఉంటాము. బేసిక్ పోలీసింగ్‌తో పాటు టెక్నాలజీను వాడాలి. పేదవారికి కష్టంలో, ఆపదలో పోలీస్ ఉన్నాడని గుర్తు చేయండి. ఆపదలో ఆదుకున్న వాళ్ళని పేదవారు ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటారు’ అని డీజీపీ లేఖలో పేర్కొన్నారు.