స్త్రీల కోసం రైడ్‌ | Telangana DGP CV Anand launches Stree Ride for women drivers | Sakshi
Sakshi News home page

స్త్రీల కోసం రైడ్‌

Jun 7 2026 5:36 AM | Updated on Jun 7 2026 5:37 AM

Telangana DGP CV Anand launches Stree Ride for women drivers

స్త్రీ రైడ్‌ మహిళా డ్రైవర్లు

మహిళల కోసం మహిళలే డ్రైవర్లుగా.. ‘స్త్రీ రైడ్‌’ ప్రారంభించిన డీజీపీ ఆనంద్‌

మోవో ఫ్లీట్‌ యాప్‌ ద్వారా మహిళా డ్రైవర్లతో కూడిన బైక్, ఆటో సర్విసులు అందుబాటులోకి

55 మంది మహిళా డ్రైవర్లకు శిక్షణ ఇప్పించిన మహిళా భద్రత విభాగం

సాక్షి, హైదరాబాద్‌: మహిళల భద్రతతోపాటు వారి స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర మహిళా భద్రత విభాగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒంటరి మహిళలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు మహిళలే డ్రైవర్లుగా ఉన్న బైక్, ఆటోలతో కూడిన క్యాబ్‌ సర్విసులను స్త్రీ రైడ్‌ పేరిట అందుబాటులోకి తెచి్చంది. మహిళా డ్రైవర్ల వాహనాలను డీజీపీ సీవీ ఆనంద్‌ ఇతర అధికారులతో కలిసి శనివారం హైదరాబాద్‌లో జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సేవలను పొందేందుకు మహిళా ప్రయాణికులు మోవో ఫ్లీట్‌ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్‌ ద్వారా రైడ్‌ బుక్‌ చేసుకుంటే మహిళా డ్రైవర్లే వచ్చి పికప్‌ చేసుకొని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తారు. ఇందులో భాగంగా తొలివిడతలో మొత్తం 55 మంది మహిళా డ్రైవర్లకు బైక్, ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించడంతోపాటు వారంతా రవాణా, డెలివరీ రంగాల్లో స్వయం ఉపాధి పొందేలా మొబిలిటీ సర్విస్‌ ప్రొవైడర్లు, అగ్రిగేటర్స్‌తో మహిళా భద్రత విభాగం అనుసంధానం చేసింది.  

మహిళలు కూడా గిగ్‌ వర్కర్లుగా రావడం శుభపరిణామం: డీజీపీ 
అంతకుముందు డీజీపీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్, మహిళా భద్రత విభాగం డీజీ చారు సిన్హా, మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, రవాణాశాఖ కమిషనర్‌ ఇలంబర్తి, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ శ్రుతి ఓజా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ స్విగ్గీ, జొమోటో వంటి గిగ్‌వర్కర్లలో ఇప్పటివరకు పురుషులే ఉండేవారని.. ఇకపై అందులోకి మహిళలు కూడా రావడం శుభపరిణామం అన్నారు. డ్రైవర్లుగా పనిచేస్తున్న మహిళలకు ఏ ఇబ్బందులున్నా అండగా ఉంటామని మహిళా భద్రత విభాగం డీజీ చారుసిన్హా అన్నారు. కార్యక్రమంలో శాంతిభద్రతల డీజీ మహేశ్‌ భగవత్, డీజీ ఆర్గనైజేషన్స్‌ స్వాతిలక్రా పాల్గొన్నారు. 

ధైర్యం పెరిగింది 
భర్త చనిపోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ నేను తీసుకున్నాను. నా ఇద్దరు పిల్లల కోసం కష్టపడుతున్నాను. నాలుగు నెలలుగా బైక్‌ నేర్చుకుంటున్నాను. ఈ శిక్షణతో నాలో ధైర్యం పెరిగింది.  – అర్చన, శ్రీరామ్‌కాలనీ, శంషాబాద్‌ 

నెలకు రూ. 30 వేలకు సంపాదిస్తున్నా 
‘మోవో ఫ్లీట్‌’లో రెండేళ్లుగా పనిచేస్తున్నాను. నెలకు రూ. 30 వేల వరకు సంపాదిస్తున్నాను. ఇప్పుడు స్త్రీ రైడ్‌లోకి వచ్చాక మరింత ధైర్యం పెరిగింది. ఉమెన్‌ టు ఉమెన్‌ పికప్, డ్రాప్‌లు చేసేందుకు మహిళా భద్రత విభాగం అవకాశం కల్పిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement